Menu Close

Seethamma Vakitlo Sirimalle Chettu Lyrics In Telugu – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లిరిక్స్

Seethamma Vakitlo Sirimalle Chettu Lyrics In Telugu – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లిరిక్స్

యెకువలోన గోదారి ఎరుపెక్కింది… ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
యెకువలోన గోదారి ఎరుపెక్కింది… ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది

పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి… ఆహ సిగ్గంత చీరగట్టింది
చీరలో చందమామ ఎవ్వరమ్మ… !!!
ఆ గుమ్మ సీతమ్మ…

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు… సిరిమల్లె చెట్టేమో విరగ బూసింది
కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు… కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పెడంతెందుకండి… కొదండరామయ్య వస్తున్నాడండి

రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య… వస్తూ చేసాడోయమ్మ ఏదోమాయ
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య… వస్తూ చేసాడోయమ్మ ఏదోమాయ

సీతకి రాముడే సొంతమయ్యే చోటిది… నేలతో ఆకశం వియ్యమొందే వేలిది
మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి… ముచ్చటొచ్చెనమ్మ… ఆ ఓ ఓ
ఏడు అంగలేస్తె ఏడు జన్మాలకి… వీడదీ సీతమ్మ… ఆ ఆ… ఓ ఓ ఓ ఓ

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు… సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మ ముద్దుగ చెప్పిందోమాట… ఆ మాట విన్నావా రామ అంటుంది
రామ రామ అన్నది ఆ సీత గుండె… అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే

చేతిలో చేతులే చేరుకుంటే సంబరం… చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటు గొంతు విప్పాయంట… చుట్టు చెట్టు చేమా… ఆ ఓ ఓ
పంట పండిందంటు పొంగిపోయిందమ్మ…
ఇదిగో ఈ సీతమ్మా… ఆ ఆ… ఓ ఓ ఓ ఓ.. ..

Seethamma Vakitlo Sirimalle Chettu Lyrics In Telugu – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading