Menu Close

Katuka Kallanu Chuste Lyrics in Telugu – Mirchi – కాటుక కళ్ళను చూస్తే లిరిక్స్

Katuka Kallanu Chuste Lyrics in Telugu – Mirchi – కాటుక కళ్ళను చూస్తే లిరిక్స్

కాటుక కళ్ళను చూస్తే… పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే… పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే… పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చూస్తే… పోతుందే మతి పోతుందే
లేటుగు ఇంతందాన్ని… చూసానే అనిపిస్తుందే
నా మనసే నీవైపొస్తుందే…

ఇదేదో బాగుందే చెలి… ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలి… ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటె… నాకెంతో సరదాగుందే
ఆశలు రేపేడుతుంటే… నాకెంతో సరదాగుందే
నిన్నిలా అల్లాడిస్తే… నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే… నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం… అయ్యయ్యో అనుకుంటునే
ఇలాగే ఇంకాసేపంటుంటే…

ఇదేదో బాగుందే మరి… ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి… ఇదే ప్రేమనుకుంటే సరి

తెలుసుకుంటావా తెలుపమంటావా…
మనసు అంచుల్లో… నించున్న నా కలని
ఎదురు చూస్తున్న… ఎదుటనే ఉన్న
బదులు దొరికేట్టు… పలికించు నీ స్వరాన్ని

వేల గొంతుల్లోన… మోగిందే మౌనం
నువ్వున్న చోటే నేననీ…
చూసి చూడంగానే… చెప్పింది ప్రాణం
నే న్నీదాన్నై పోయానని…

ఇదేదో బాగుందే చెలి… ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి… ఇదే ప్రేమనుకుంటే సరి

తరచి చూస్తూనే తరగదంటున్న
తళుకు వర్ణాల… నీ మేను పూలగని
నలిగిపొతునే వెలిగిపొతున్న
తనివి తీరేట్టు… సంధించు చూపులన్ని

కంటి రెప్పలు రెండు… పెదవుల్లా మారి
నిన్నే తినేస్తామన్నాయే…
నేడో రేపో… అది తప్పదుగా మరి
నీకోసం ఎదైనా సరే…

ఇదేదో బాగుందే చెలి… ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి… ఇదే ప్రేమనుకుంటే సరి.. ..

Katuka Kallanu Chuste Lyrics in Telugu – Mirchi – కాటుక కళ్ళను చూస్తే లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading