Menu Close

Nee Parichayamutho Song Lyrics in Telugu – Choosi Choodangaane

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

నీ పరిచయముతో నా మదిని గెలిచా… నీ పలకరింపుతో నా దిశను మార్చిన…
అడుగు నీతో కలిపి… అలసటలెన్నో మరిచా…

నలుగురితో నేనున్నా… విడిపడి నీకై నడిచా…
నీ పరిచయముతో నా మదిని గెలిచా…

ఏ గతము ఎదురవధిక… నీ తలపే జతపడితే…
ఏ గురుతు నిలబడదిక… నీ పిలుపు వినపడితే…
నాలోని లోతు చూపిన నా పరిచయముతో…

నిలువునా నే వెలిగి… వెలుగులలో నే మునిగినా…
పదనిసలేవో తడిమి… పరవశమై పైకెగిరా…

నీ చెలిమి ప్రతిక్షణముని… నా వరకు నడిపినదీ
నీ మహిమే ప్రతి మలుపుని.. తీరముగ మలిచినది…

నాలోని నన్ను చేర్చిన.. నీ పరిచయముతో…
నీ పరిచయముతో… నా కళను కలిశా
నీ వెలుగు వానలో నే తడిసిపోయిన…

అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా…
నలుగురితో నేనున్నా… విడిపడి నీకై నడిచా…

చివరిదాకా నిలిచే హృదయమునే నే కలిశా…
చెరగని ప్రేమై మిగిలే… మనసుని నేనై మురిశా…

Like and Share
+1
0
+1
1
+1
0

Subscribe for latest updates

Loading