Menu Close

ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు – M S Dhoni

ఏం ఎస్ ధోని క్రికెట్ ప్రస్తానం…మహేందర్ సింగ్ దోని ఒక పేరు మాత్రమే కాదు ఒక ఉద్వేగం.

telugu bucket

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. భారత దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా అలాగే ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోపిలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించాడు ధోని.

7 జులై 1981 రాంచి లో జన్మించ్చిన ధోని 23 డిసెంబర్ 2004 లో భారత జట్టు తరపున వన్డే అరంగేట్రం చేసాడు.ధోని జట్టులోకి వచ్చిన మొదట్లో తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేదు. 2005 లో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక ఆ తర్వాత నుండి అతను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇక అదే ఏడాది శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో 145 బంతుల్లో 183 పరుగులు బాది అప్పటివరకు భారత్ తరపున వన్డే లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ ప్రదర్శనతో అదే సంవత్సరం టెస్ట్ మ్యాచ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2007టీ 20 ప్రపంచ కప్ కు ముందు అనుకోకుండా భారత పగ్గాలు అందుకున్న ధోని ఆ టోర్నమెంట్ చివరి మ్యాచ్ల్లో భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై తన తెలివితో విజయంసాధించి జట్టుకు ట్రోఫీ అందించి తానేంటోనిరూపించుకున్నాడు.

ఇక 2008, 2009 లోధోని వరుసగా ఐసీసీ వన్డే ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. అయితే అప్పటివరకు ఈ అవార్డు ను రెండుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడు ధోనీనే. కెప్టెన్ గా ఎంపికైన తర్వాత నుండి జట్టును విజయ పథంలో నడిపిస్తున్న ధోని 2011 లో భారత 28 ఏళ్ళ కలను నెరవేర్చాడు. 2011 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో 79 బంతుల్లో 91 పరుగులు తో నాట్ ఔట్ నిలిచి భారత్ కు ప్రపంచ కప్ అందించాడు. అయితే అప్పటికే బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నా ధోని ఆ మ్యాచ్ చివర్లో కొట్టిన సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయేఘటన.

1983 లో కపిల్ దేవ్ తర్వాత మళ్ళీ 28 ఏళ్లకు ఈ టైటిల్ అందుకున్న రెండో భారత కెప్టెన్ ధోని. ఇక ఆ తర్వాత మరో రేడు సంవత్సరాలకి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు సాధించని రికార్డును ధోని సాధించాడు. 2013 ఛాంపియన్ ట్రోఫీ విజయం తో క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా నిలిచ్చాడు ధోని. కేవలం భారత జట్టునే కాకుండా ఐపీఎల్ లోతన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు సార్లు టైటిల్ అందించాడు.

అటువంటి ధోని ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నమెంట్ల ఓటముల తర్వాత 2017 జనవరి లో వన్డే మరియు టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఇక అప్పటినుండి ధోని కెరియర్ పై అనుమానాలు మొదలయ్యాయి. అలాగే తన రిటైర్మెంట్ ప్రశ్న వెలుగులోకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే 2019 సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత నుండి జట్టుకి దూరంగా ఉన్నాడు. అలాగే బీసీసీఐ తమ కాంట్రాక్టు లో కూడా ధోనికి చోటు కల్పించలేదు.

దాంతో అందరి అనుమానాలు ఇంకా బలపడ్డాయి. కానీ ధోని మాత్రం ఈ విషయం పై ఏం స్పందించకుండా అనూహ్యంగా గత ఏడాది ఆగస్టు లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో ధోని ఆడగా అతని చెన్నై జట్టు పూర్తిగా విఫలం అయ్యింది. ఇక ఈ ఏడాది జరుగ్గుతున్న ఐపీఎల్ సీజన్ లో ధోని జట్టు రాణిస్తున్న కరోనా కారణంగా ఆ లీగ్ వాయిదా పడింది. దాంతో మళ్ళీ ధోని ఎప్పుడెప్పుడు గ్రౌండ్ లోకి అడుగు పెడతాడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Like and Share
+1
0
+1
1
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images