Menu Close

Nee Choopule Naa Oopiri Lyrics In Telugu – Endukante Premanta – నీ చూపులే నా ఊపిరి లిరిక్స్

Nee Choopule Naa Oopiri Lyrics In Telugu – Endukante Premanta – నీ చూపులే నా ఊపిరి లిరిక్స్

నీ చూపులే నా ఊపిరి… ఓ సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి… అందించవే దీపావళి
ఎందుకె చెలియా… రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే… రేపటి వెలుగును చూసి చూడవెలా
నయనం హృదయం… నీవే నీనై
సమయం వెనుకే… చేసా పయనం
తదుపరి జన్మకైన… జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా… హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ

రోజూ కొత్తగా నీ సందర్శనం… ఆహా అన్నదీ నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం… ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే… మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ… వెన్నెలయిందే ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే… తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని… ఎన్నో జన్మలనీ
నయనం హృదయం… నీవే నీనై
సమయం వెనుకే… చేసా పయనం
తదుపరి జన్మకైన… జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా

నీతో బంధమే రాసిందెవ్వరో… నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో… నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లో… పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే… కలిసే రేపటి పొద్దుల్లో

నీ చూపులే… నననాననా, నా ఊపిరి… హ్మ్ హ్మ్ హ్మ్
ఓ సారి ఇలా… నన్నాన్ననా… చూడే చెలి… ఆఆ ఆ
అమవాస్యనై ఉన్నా మరి… అందించవే దీపావళి
ఎందుకె చెలియా… రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే… రేపటి వెలుగును చూసి చూడవెలా

నయనం..ఆఆ,
హృదయం… ఆఆ
నీవే.. .ఆఆ, నీనై… ఆఆ
సమయం వెనుకే…ఆఆ
చేసా పయనం… ఆఆ
తదుపరి జన్మకైన… జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా… హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ.. ..

Nee Choopule Naa Oopiri Lyrics In Telugu – Endukante Premanta – నీ చూపులే నా ఊపిరి లిరిక్స్

Like and Share
+1
0
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading