ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Naalo Nenena Song Lyrics In Telugu – నాలో నేనేనా… ఏదో అన్నానా
నాలో నేనేనా… ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో… నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన… ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది… మాటే నీది, ఇదేం మాయో
నాలో నేనేనా… ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో… నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా
అవును కాదు తడబాటుని
అంతో ఇంతో గడి దాటనీ
విడి విడిపోని పరదాని
పలుకై రాని ప్రాణాన్ని
ఎదంతా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది… మాటే నీది, ఇదేం మాయో
నాలో నేనేనా… ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో… నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా
దైవం వరమై దొరికిందనీ
నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్ని
చిగురైపోని శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
నూరేళ్ళుగా ఎదిగి పోయాయిలా
మనమే సాక్ష్యం… మాటే మంత్రం
ప్రేమే బంధం
నాలో నేనేనా… ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో… నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా.. ..
Naalo Nenena Song Lyrics In Telugu – నాలో నేనేనా… ఏదో అన్నానా