అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
నాలో చిలిపి కల… నీలా ఎదురైందా
ఏదో వలపు వల… నన్నే లాగిందా
నాలో చిలిపి కల… నీలా ఎదురైందా
ఏదో వలపు వల… నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహలేమిటో… చూపలేని దాచలేని అల్లరిలా
తియ్యని ఈ వేదనేమిటో… మాటలే మోయలేని మౌనంలా
ఎంత ఉప్పెనో నాలోన… ఎంత చప్పుడో గుండెలోన
చెప్పమంటే ఎన్ని తిప్పలో… చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా
నీకు నాకు మధ్య దూరమైనా… లెక్క వేస్తే ఒక్క అడుగేనా
ఒక్క అడుగులో జీవితం దాగినట్టు… దాటలేకపోతున్నా
ప్రేమనే రెండక్షరాలతో… నీకు నాకు మధ్యనే వంతెనేయనా
నింగిలో ఆ లక్ష తారలే కలుపుతూ… ప్రేమలేఖ నీకు రాయనా
నిసాని గారిస నిసాని గారిస
నిసాని గారిస నిసనిపమగమపని
నిసాని గారిస నిసాని గారిస
నిసాని గారిస నిసనిపమగమపని
నాలో చిలిపి కల… నీలా ఎదురైందా
ఏదో వలపు వల… నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహలేమిటో… చూపలేని దాచలేని అల్లరిలా
తియ్యని ఈ వేదనేమిటో… మాటలే మోయలేని మౌనంలా
నిసాని గారిస నిసాని గారిస
నిసాని గారిస నిసనిపమగమపని