Menu Close

శయన నియమాలు – Must Follow Rules for Healthy Sleep


ఈ శయన నియమాలు అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు – Must Follow Rules for Healthy Sleep

1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు ( మనుస్మృతి)
2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు ( విష్ణుస్మృతి)
3. విద్యార్థి, నౌకరు మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచోవీరిని మేల్కొలపవచ్చును ( చాణక్య నీతి)
4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి( దేవీ భాగవతము).
5. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణము)

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
sleeping women

6. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది( అత్రి స్మృతి)
7. విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం ( మహాభారతం)
8. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు( గౌతమ ధర్మ సూత్రం)

9. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,
పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత,
ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు.
ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది( ఆచార మయూఖ్ )

10. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు. పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది.
11. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు( బ్రహ్మా వైవర్తపురాణం)
12. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి.

13. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
14. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు. యముడు మరియు దుష్ట గ్రహముల నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతి మరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.
15. గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

16. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.
17. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)

ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు.

యథా పిండే తథా బ్రహ్మాండే – నీలోనే విశ్వం – Proof That Indian Scriptures Understood the Cosmos Long Ago

గమనిక : ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇతర మాద్యమాల నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
Share with your friends & family
Posted in Health, Hinduism, Life Style

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading