Menu Close

50 Rules – ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు

ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు

50 Kamasutra Rules You Must Follow: ప్రతి ప్రాణికి నిత్యము శరీరము నందు సంభోగేచ్ఛ కలుగుచుండును. సంభోగించని యెడల శరీరము నందు మేహరోగం, మేధోవృద్ధి, శరీర సంధులు సడలుట వంటి సమస్యలు కలుగును.

సంభోగ సంబంధ ఆలోచనలు కలిగినపుడు బలవంతముగా మనస్సును నిరోధించుట, క్రోధము చెందుట, బ్రహ్మచర్యము, స్త్రీ సంభోగ సుఖం అనుభవించకుండా ఉండటం వలన మనుష్యుడు యొక్క శుక్రము క్షీణించును.

శుక్రము క్షీణించినవానికి శరీర దౌర్బల్యము, ముఖం వాడుట, పాండురోగం చిక్కిపోవుట, భ్రమ, నపుంసకత్వం, తన ప్రమేయం లేకుండానే శుక్రస్కలనం
జరుగును.

ఒకే గోత్రం గల స్త్రీ, శత్రువు భార్య, రాజు భార్య, మిత్రుని భార్య, దీర్ఘరోగములు కలిగిన స్త్రీ, శిష్యుని భార్య, బ్రాహ్మణ స్త్రీ, పిచ్చితో బాధపడుతున్న స్త్రీ, సన్యసించిన స్త్రీ, పతివ్రత, గురువు యొక్క భార్య, ముసలితనం గల స్త్రీ, గర్భవతి, అపరిచిత స్త్రీ వీరితో సంభోగం జరుపుట నిషిద్దం మరియు ధర్మశాస్త్ర విరుద్ధం.

బాల,ముగ్ధ, ప్రౌఢ (అధిక వయస్సు) స్త్రీల యొక్క వయోబేధమును, అనురాగమును అనుసరించి సంభోగక్రియ జరుపవలెను.

స్త్రీ పదహారు సంవత్సరముల వరకు బాల అనియు, పదహారు మొదలుకొని ముప్పైరెండు సంవత్సరముల వరకు తరుణి అనియు, ముప్పైరెండు సంవత్సరముల నుండి యాభై సంవత్సరాల వరకు ప్రౌఢ అనియు, యాభై సంవత్సరాల పైబడిన వృద్ధ స్త్రీ అని అందురు. ఈ వృద్ధ స్త్రీతో సంభోగం నిషిద్దం.

Couple Love

గ్రీష్మ, శరదృతువుల యందు కామేచ్ఛ గల పురుషుడు బాలసంభోగం హితకరం. హేమంత, శిశిర ఋతువు నందు తరుణియగు స్త్రీతో రమించుట హితకరం, వర్ష, వసంత ఋతువు యందు ప్రౌడ స్త్రీతో రమించుట హితకరం.

బాలా సంభోగం బలమును వృద్ధిచేయును. తరుణీ సంభోగం శక్తిని క్షీణింపచేయును. ప్రౌఢ సంభోగం ముసలితనమును కలిగించును. ఈ నియమాలు అతిగా సంభోగించువారికి మాత్రమే. నియమిత పద్దతిలో కాలాన్ని అనుసరించి సంభోగించువారికి ఎటువంటి అనారోగ్యం కలగదు.

కొత్తమాంసం, వేడిగా ఉన్న అన్నం, యవ్వన స్త్రీతో సంభోగం, పాలతో కూడిన అన్నం, నెయ్యి, వేడినీటి స్నానం ఈ ఆరు సేవించిన వెంటనే శరీర బలాన్ని పెంచును.

చెడిపోయిన మాంసం, వృద్ధస్త్రీ సంభోగం, ఉదయపు ఎండ, రేగటి పెరుగు, ప్రాతఃకాలంలో స్త్రీతో సంభోగం, ప్రాతఃకాలంలో నిద్ర ఈ ఆరు వెంటనే బలాన్ని హరించును.

వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీతో రమించిన పడుచువాడు అయినను వృద్ధలక్షణాలు కలిగినవాడిగా అగును.

హేమంత, శిశిర ఋతువుల యందు వాజీకరణ ఔషధాలు సేవించిన పురుషుడు యథేచ్ఛగా స్త్రీతో రమించవచ్చు. తప్పనిసరిగా వాజీకరణ ఔషధాలు సేవించవలెను . వసంత, శరదృతువుల యందు మూడు దినములకొకసారి, గ్రీష్మ, వర్ష ఋతువుల యందు పదిహేను రోజులకు ఒకసారి స్త్రీ సంభోగం
ఆచరించవలెను.

మనుష్యునికి శీతాకాలం నందు రాత్రి సమయములో, గ్రీష్మ కాలము నందు పగటి యందు, వసంతఋతువులో ఆహోరాత్రుల యందు, వర్షాకాలం నందు మేఘాలు గర్జించు కాలం నందు, శరదృతువులో ఎల్లప్పుడూ కామోద్రేకం కలుగుచుండును.

పగటి యందు స్త్రీ సంభోగం ఆయుక్షీణం. సంభోగమునకు గ్రీష్మ, వసంత ఋతువులు అనుకూల కాలం.

ఉదయ సంధ్య, సాయంత్రపు సంధ్యాకాలము నందు, పర్వదినముల యందు, గోవులను విడుచు ప్రభాతవేళ, అర్థరాత్రి యందు, మధ్యాహ్న కాలం నందు సంభోగం నిషిద్దం.

శృంగారం sfx couple

శరీరబలం కలిగినవాడు, వాజీకరణ ఔషధాలు సేవించువాడు, యవ్వనవంతుడు ప్రతినిత్యం సంభోగం జరపవచ్చు.

గురువులు నివశించే ప్రదేశమునకు సమీపస్థలం, బహిరంగ ప్రదేశముల యందు, దుఃఖకరమైన మాటలు వినపడు ప్రదేశముల యందు స్త్రీసంభోగం నిషిద్దం.

అధికభోజనం చేసినవాడు, భయం కలిగినవాడు, శరీర అవయవముల యందు బాధ కలిగినవాడు, దప్పిక కలిగినవాడు, బాలుడు, వృద్ధుడు, మలమూత్రాలు వచ్చువాడు, రోగముతో భాధపడువాడు స్త్రీ సంభోగం చేయరాదు.

రజస్వల అయిన స్త్రీ, సంభోగము నందు ఇష్టతలేనిది, మాలిన్యము కలిగినది, వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీ, రోగపీడితురాలు, అంగలోపము కలిగినది, గర్బవతి, ద్వేషించునది అయిన స్త్రీతో సంభోగం నిషిద్దం. ఇట్టి స్త్రీలతో రమించిన రోగములు కలుగును.

సంభోగ నిగ్రహము లేని పురుషుడు రజస్వల అయిన స్త్రీతో సంభోగించిన పురుషునికి దృష్టి, ఆయువు, తేజస్సు నశించును.

గర్భవతితో రమించిన గర్భమునకు హాని, రోగగ్రస్థ స్త్రీతో రమించిన బలం కోల్పోవును మరియు మలినంతో ఉన్నది, ద్వేషించునది, శరీరం కృశించినది, బహిరంగ ప్రదేశమునందు సంభోగించిన శుక్రము క్షీణించి మనస్సు వికలతనొందును.

ఆకలిగొనినవాడు, మనస్సు యందు కలవరం కలిగినవాడు, దప్పికతో ఉండువాడు, శరీర దుర్బలత కలిగినవాడు స్త్రీసంభోగం చేసినయెడల శుక్రం క్షీణించి వాతం ప్రకోపించును. ఆరోగ్యవంతుడు అయినను మధ్యాహ్న కాలం నందు రమించిన యెడల పైన చెప్పిన గుణములే కలుగును.

రోగ పీడితుడు స్త్రీసంభోగం చేసిన దేహబాధ, ప్లీహోదరం (spleen enlargement), మూర్చ, మృత్యువు కలుగును. సంధ్యాసమయం, అర్థరాత్రి యందు సంభోగం వొనర్చిన వాత, పిత్తములు ప్రకోపించును.

రోగములు కలిగిన యోని యందు, గుదము నందు అంగప్రవేశం చేసి సంభోగం జరిపిన ఉపదంశం ( అంగము నందు తీవ్రంగా పోటు, కురుపులు), వాతప్రకోపం, శుక్ర క్షయం కలుగును.

మలమూత్రాలు వచ్చుచున్నప్పుడు అవి నిరోధించి (ఆపుకొని ) సంభోగం చేసిన, స్కలన సమయంలో శుక్రము బయటకి రాకుండా బలవంతముగా ఆపుట వలనను, శుక్ర స్కలన సమయంలో వెల్లికిలా పడుకొని శుక్రం స్కలించుచున్న శుక్రం రాయిలా గడ్డకట్టి విపరీతమగు నొప్పి వచ్చు శుక్రశ్మరీ అను వ్యాధి వచ్చును. కావున ప్రకృతి విరుద్ధములు అగు కార్యములను చేయకుండా ఉండటం మంచిది.

సంభోగానంతరం, స్నానం, చందనలేపనం చేసుకుని చల్లనిగాలి, మధురభక్ష్యములు, చల్లని నీరు, పాలు, మాంసరసం, పెసరకట్టు, ద్రాక్షారసం వంటివాటిని సేవించి మెత్తని పాన్పుపైన పడుకొని నిద్రించవలెను . ఇలా చేయుట వలన శరీరమునకు అంతకు ముందు ఉండు బలం సిద్ధించి నీరసం, నిస్సత్తువ పోవును .

మన శరీర బలమునకు మించి అతి మైధునం చేయుటవలన వాతవ్యాధులు, శూల, కాస, జ్వరం, శ్వాస, లివరు రోగములు, పాండువు, క్షయ వంటి వ్యాధులు సంభంవించును.

పైనచెప్పిన విధముగా నియమితకాలాన్ని అనుసరించి సంభోగ క్రియను నిర్వర్తిస్తూ ఆరోగ్యముగా ఉండగలరు.

Telugu Love Stories – రొమాంటిక్ లవ్ స్టోరీ

Like and Share
+1
0
+1
0
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images