Menu Close

Mukundha Mukundha Song Lyrics In Telugu

ముకుందా ముకుందా కృష్ణ… ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా ||2||

వెన్న దొంగవైనా… మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా
ముకుందా ముకుందా కృష్ణ… ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా
జీవకోటి నీ చేతి… తోలు బొమ్మలే
నిన్ను తలచి… ఆటలాడే కీలు బొమ్మలే
ముకుందా ముకుందా క్రిష్ణా… ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా

జయజయరామ్ జయజయరామ్… జయజయరామ్ జయజయరామ్
సీతారామ్ జయజయరామ్… జయజయరామ్ జయజయరామ్

నీలాల నింగి కింద… తేలియాడు భూమి
తనలోనే చూపించాడు… ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే… సర్ప శేషమే ఎక్కి
నాట్యమాడి కాలీయుణీ దర్పమణిచాడు
నీ ధ్యానం చేయు వేళ… విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే… కృష్ణ తత్వమేగా

అట అర్జునుడొందెను… నీదయ వల్ల గీతోపదేశం
జగతికి సైతం… ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే… రేపల్లె రాగం తానం రాజీవమే
హే! ముకుందా ముకుందా… కృష్ణ ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా

మత్స్యమల్లె నీటిని తేలి… వేదములను కాచి
కూర్మరూప ధారివి నీవై… భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి… నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై… హిరణ్యున్ని చీల్చావు
రావణుని తలలను కూల్చి… రాముడివై నిలిచావు
కృష్ణడల్లె వేణువూది… ప్రేమను పంచావు

ఇక నీ అవతారాలెన్నెన్నున్నా… ఆధారం నేనే
నీ ఒరవడి పట్టా… ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా
ముకుందా ముకుందా… కృష్ణ ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

ఎక్కడో ఎక్కడో… నా బిడ్డ తల్లో
ఇంకా రాలే కబురు తల్లో
గగనం నుంచి వచ్చే ధీరుడు
చెపుతై అండీ సన్నాసులు
రా రా వరదా… త్వరగా రా రా
ఇప్పుడే రా రా… రా రా
గోవింద… గోపాలా

ముకుంద ముకుంద కృష్ణ… ముకుంద ముకుంద
స్వరంలో తరంగ… బృందావనంలో వరంగా ||2||

Like and Share
+1
2
+1
2
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading