Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Nijanga Nenena Song Lyrics In Telugu – Kotha Bangaru lokam
నిజంగా నేనేనా… ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా… ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి… అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ… నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే… హరే హరే రామా
మరి ఇలా ఎలా… వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నాదే… లోలోన ఏమ్మా
హరే హరే హరే… హరే హరే రామా
మరి ఇలా ఎలా… వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నాదే… లోలోన ఏమ్మా
నిజంగా నేనేనా… ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా… ఎన్నో వింతలూ చూస్తున్నా
ఈ వయస్సులో… ఒక్కో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే… ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం… పొంగే సంతోషం
అడుగులలోన అడుగులు వేస్తూ… నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు… గడిచిన కాలం, ఎంతని నమ్మనుగా
నిజంగా నేనేనా… ఇలా నీ జత లో ఉన్నా
ఇదంతా ప్రేమేనా… ఎన్నో వింతలూ చూస్తున్నా
నా కలే ఇలా నిజాలుగా… నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలై… పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమే… కురుస్తూ ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట… పరవశమేదో తోడవుతుంటే
పగలే ఐనా గగనంలోన… తారలు చేరేనుగా
నిజంగా నేనేనా… ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా… ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి… అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ… నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే… హరే హరే రామా
మరి ఇలా ఎలా… వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నాదే… లోలోన ఏమ్మా
హరే హరే హరే… హరే హరే రామా
మరి ఇలా ఎలా… వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నాదే… లోలోన ఏమ్మా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.