ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా…
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా…
నేటికి నేడు, మారిన ఈడు… చేసె నేరమే
నిద్దుర లేదు, ఆకలి లేదు… అన్ని దూరమే
చక్కదనాల చుక్కకివాళ… దిష్టి తీసి హారతియ్యనా
అమ్మడివే… ఏ ఏ
స ద ని స… ద ని స మ గ మ గ స
ద ని స గ గ స ద ప గ స గ గ స ని ద ని స…
కలలను దాచే నా కన్ను నీవే… నిజమై పోవే నావన్ని నీవే
పగలే మెరిసే మిణుగురువే… నగలే వెలిసే వెలుగు నువ్వే
ఇలపై నడిచే మెరుపు నువ్వే… హా..! ఇకపై వరమై దొరుకు నువే
నీడ కూడా చీకట్లో… నిన్నొదిలి పోతుందే
నేనెపుడూ నీ వెంటే ఉంటా…
ముద్దాబంతి పువ్వు… ఇలా పైట వేసెనా
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా
పరుగులు తీసే నా రాణి నీవే… పడితే మెత్తని నేలౌతాలే
ఎపుడూ నిలిచే భుజమౌతా… కలను కంటే నిజమౌతా
కష్టం వస్తే కలబడతా… హా..! కడదాకా నే నిలబడతా
అలిసొస్తే జో కొడతా… గెలిచొస్తే జై కొడతా
కలిసొస్తే ఓ గుడినే కడతా…
ముద్దాబంతి పువ్వు… ఇలా పైట వేసెనా
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా
హోయ్..! మౌనంగానే సైగలతోనే ఎంత కాలమే
జాలిని చూపి దగ్గరయ్యేటి దారి చూపవే…
ఆపసోపాలే నావిక ఆపే… ఒక్కసారి చెంత చేరవే
అమ్మడివే…ఏ అమ్మడివే… ఏ
తందానానే నా…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.