ఈ కథ చదివితే జీవితంపై ఆశ చిగురిస్తుంది – Motivational Stories

Motivational Stories: ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ఈ కథ చదివితే జీవితంపై ఆశ చిగురిస్తుంది. జీవితం అన్నాక కష్టాలు రావడం సర్వసాధారణం. అయితే కష్టాలను తలుచుకుంటూ జీవిస్తే జీవితంలో ముందుకు సాగలేం. ఈ చిన్న కథ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఆ కథేంటంటే..
రాజు అనే యువకుడు జీవితంలో అన్ని కోల్పోతాడు. చేసిన వ్యాపారంలో నష్టాలు వస్తాయి. సంపాదన అంతా ఆవిరైపోతుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. చివరికీ అంతా దూరమై ఒక్కడే మిగిలిపోతాడు. ఇక ఎక్కడ చూసినా ఏం కనిపించదు.? చావు ఒక్కటే తనకు దిక్కు అని ఫిక్స్ అవుతాడు. ఊరి చివరల్లో చెరువులో దూకి చనిపోదామని అనుకుంటాడు.
వెళ్లి చెరువు కట్టపై కూర్చొని తన జీవితంలో జరిగిన క్షణాలను తలుచుకుంటూ బాధపడుతుంటాడు. ఇంతలోనే అటుగా ఓ సాధువు వెళ్లూ.. ఏమైంది అంటాడు. దీంతో వెంటనే స్పందించిన రాజు.. తన కష్టాలను చెప్పుకొస్తాడు. అయితే సాధువు ఒక పని చెప్తాను చేస్తావా? అని అంటాడు. చిన్న గిన్నెలో నీరి నింపి నది వరకు వెళ్లి రమ్మని చెప్తాడు. అయితే ఓ షరతు పెడ్తాడు.
ఎట్టి పరిస్థితుల్లో నీటి చుక్క కింద పడకూడదని అని చెప్తాడు. దీంతో రాజు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నది వరకు వెళ్లి వస్తాడు. రాగానే సాధువు.. ‘నువ్వు నడిచేటప్పుడు ఎవరి గురించి ఆలోచించావు?’ అని అడిగాడు. అందుకు రాజు బదులిస్తూ.. “ఏదీ ఆలోచించలేదు. నా దృష్టి మొత్తం ఈ గిన్నెలోని నీటిపైనే ఉంది.” అందుకే నీటి చుక్క కింద పడలేదు అని చెప్తాడు.
సాధువు బదులిస్తూ.. జీవితం కూడా అంతే.. నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే, నీకు ఎన్ని కష్టాలొచ్చినా, నువ్వు ఎన్ని సార్లు ఓడిపోయినా, ఎంతమంది నిన్ను విమర్శించినా.. అవన్నీ నీకు కనిపించవు. నీ దారి పైనే మాత్రమే నీ దృష్టి వుంటుంది, వుండాలి. అప్పుడే అనుకున్నది నువ్వు సాదించగలుగుతావు. ఒక్కటి గుర్తు పెట్టుకో జీవితంలో అంతా కోల్పోయినా నీకు చివరి అవకాశం ఎప్పటికీ ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మళ్లీ ముందుకెళ్లొచ్చు. అని చెప్తాడు. అది విన్న రాజు చావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకొని, మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకుసాగుతాడు.