అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మనం గెలవడానికి, ఎదగడానికి చాలా మార్గాలు వున్నాయి – Most Inspiring Story in Telugu
Most Inspiring Story in Telugu: తన వ్యాపారంలో ఘోరంగా విఫలమైన ఒక వ్యక్తి, వీధి చివరిలో కూర్చుని బాధ పడుతూ అటుగా వెళ్తున్న వారిని చూస్తున్నాడు. అప్పుడు, ఎవరో ఎదురుగా ఉన్న చెత్తకుండీ నుండి తనకు అవసరమైన పాత కాగితాన్ని తీసుకొని వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత, మరొక వ్యక్తి అదే చెత్తకుండీలో తనకు అవసరమైన ఓ సీసాను తీసుకున్నాడు.

కొద్దిసేపటకి ఓ ఆవు ఆ చెత్తకుండీ పక్కన పడి ఉన్న ఆకుకూరలను తిని తన ఆకలి తీర్చుకుంది. తరవాత ఓ కుక్క వచ్చి ఆ ఆకు మీద మిగిలున్న నాలుగు మెతుకులని తింది. అలా కొంతమంది అక్కడ చెత్త పారేస్తున్నారు, ఇంకొంతమంది తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని వెళ్తున్నారు.
ఇలా “ఒక చిన్న చెత్తకుండీ దగ్గర ఇంత మంది తమ అవసరాలను తీర్చుకోగలిగితే, ఈ సువిశాల ప్రపంచంలో మనం బ్రతకడానికి, ఎదగడానికి అవకాశాలు కరువా?” అని తనలో తాను అనుకుని, ధైర్యం చెప్పుకుని తన పాత వ్యాపారానికి తిరిగి వెళ్ళాడు. ఆ చెత్తకుండీనే తను స్పూర్తిగా తీసుకున్నాడు. కొంతమందికి అవసరం లేని వస్తువులు మరికొంతమందికి అవసరం అవుతాయి. దానినే తన వ్యాపారంగా మార్చుకుని, కష్టపడి తను ఎక్కడ ఓడిపోయాడో అక్కడే గెలిచి చూపించాడు.
ఈ సువిశాలమైన ప్రపంచంలో, మనం గెలవడానికి, ఎదగడానికి చాలా మార్గాలు వున్నాయి. గెలుపు మన శ్వాస అయితే ఓటమి మన నిశ్వాస, ఓటమి వెనక గెలుపు కూడా వుంటుంది. ఓడామని మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్తితులలోనూ ఆపకూడదు. ప్రయత్నమే మన ప్రయానమై వుండాలి. అందులో గెలుపు, ఓటములు అనీవి హల్టింగ్ పాయింట్స్ లాంటివి మాత్రమే.
- స్ఫూర్తినిచ్చే జీవిత కథలు.
- మనసును కదిలించే అద్భుత కథలు.
- విజయాన్ని సాధించిన వ్యక్తుల ప్రేరణాత్మక కథలు.
- సాధారణ జీవితం నుంచి అసాధారణ విజయానికి కథలు.
- మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే కథలు.
- జీవితాన్ని మార్చిన గొప్ప వ్యక్తుల స్ఫూర్తి కధలు.