ముసలివారి మాటల వెనక ఎంతో అనుభవం – Moral Stories in Telugu
పెద్దవారిని గౌరవించు – జ్ఞానాన్ని పొందు
ఒకరోజు అడవిలోని సింహం ఊరిమీద పడి కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేసి చంపేయసాగింది. ప్రజలు భయబ్రాంతులైయ్యారు.సింహం గర్జిస్తూ ఊరంతా… అడవిలో తిరిగినట్లు తిరుగుతుంది. ప్రజలకు ఏమి చేయాలో తోచలేదు… దాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన భటులను కూడా చంపేసేది.

ఆ వూరిలోని శాంతమ్మ అనే ఓ ముసలావిడ కొడుకుల్ని పిలిచి “సున్నం నీళ్ళలో ముంచిన ఓ మేకపిల్లను ఆ సింహానికి ఆహారంగా వేయమనీ చెప్పింది” కొడుకులు ఆ పని చేసారు. ఆకలితో వున్న సింహం అమాంతం ఆ మేక పిల్లను తినేసింది. అది సున్నం తిన్నందువలన కళ్ళు తిరిగి సృహ కొల్ల్పోయి పడిపోయింది. అప్పుడు భటులు వచ్చి దానిమీద వలవేసి పట్టుకొని భోనులో పెట్టారు.
సున్నం తింటే కళ్ళు తిరుగుతాయని మీలో ఎంతమందికి తెలుసు?
సున్నం (Calcium Hydroxide) తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత లేదా ఆమ్ల-క్షార సమతుల్యత (acid-base balance) మారిపోతుంది, ఇది నరమండలాన్ని ప్రభావితం చేసి తల తిరిగెటట్లు చేస్తుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మరింత ప్రభావాన్ని చూపుతుంది.
పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు, అనుభవాలు చాలా విలువైనవి. వృద్దుల అవసరం మనకి ఎంతో వుంది, అందరికీ అన్నీ తెలియకపోవచ్చు, కానీ ఆ పెద్దవారిలో కొంతమందికైనా కొన్ని విషియాల గురించైనా తెలియొచ్చు కదా. అంతే కాదు… పూర్వీకులు జ్ఞాపకంగా దాచుకున్న వస్తువులు కూడా ఏదో ఒక సమయంలో ఉపయోగపడతాయీ, వాటిని కూడా జాగ్రత్త చెయ్యండి.
వియ్యానికైనా, కయ్యానికైనా సము ఉజ్జి ఉండాలి – Telugu Moral Stories