వియ్యానికైనా, కయ్యానికైనా సము ఉజ్జి ఉండాలి – Telugu Moral Stories
మా నాన్న నాకు ఎప్పుడూ చెప్పే మాట “వియ్యానికైనా, కయ్యానికైనా సము ఉజ్జి ఉండాలి!” అని, అంటే మనం చేసే పని, పెట్టుకునే పోటీ మన స్థాయికి తగినట్లు ఉండాలి అని అంతేకానీ ఎవరినీ కించపరచాలి అని కాదు.
ఒక రోజు అడవిలో సింహం విశ్రాంతిగా ఉండగా, కొంత దూరంలో కొన్ని కుక్కలు పరస్పరం గొడవ పడుతూ, పెద్దగా మొరుగుతున్నాయి. అవి ఒకదానిపై మరొకటి పైచేయి సాధించాలని ఉత్సాహపడుతున్నాయి.
సింహం వాటిని చూస్తూ క్షణం ఆలోచించింది “నేను కూడా పోటీ పడుదామా?” తప్పకుండా గెలుస్తాము అని తెలిసిన పందెం ఎందుకు వదులుకుంటాం. అయితే వెంటనే, అది తన స్తాయి పందెం కాదని గ్రహించింది. “నాది గర్జన, నా పని వేట!, నేను అడవికి రాజుని. కుక్కల పందెంతో నాకేం పని?” అనుకుంది.
సింహం వేటాడాలి, గర్జించాలి కానీ మొరగకూడదు. మొరగడం కుక్కల పని.!

మనం కూడా జీవితంలో తప్పకుండా గెలుస్తాము అని తెలిసిన పందెం అయితే దాని ప్రతిఫలంతో సంబందం లేకుండా మన సామర్ధ్యాన్ని, శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటాం. అలానే మనకన్నా తెలివి తక్కువ వారితో వాదించి వారిపై ఆదిపత్యం కోసం చూస్తాం. అది సరైన ఆలోచన కాదు.
గొప్ప వ్యక్తులు ఎప్పుడూ అనవసరమైన వాదనలు, తక్కువ స్థాయి పోటీలు, చిన్న చిన్న గొడవలలో తలదూర్చరు. నాయకులు, విజేతలు అనేవారు ఎప్పుడూ తమ స్థాయికి తగ్గట్టే పోటీ పడతారు. మనం సింహంలా ఉండాలి. తెలివిగా, గౌరవంగా, ఒక లక్ష్యంతో!. కుక్కలలా అర్థంలేని గొడవల్లో, తక్కువ స్థాయి పోటీల్లో తలదూర్చకూడదు.
గుర్తుంచుకోండి
“మీరు గొప్పవారు అయితే, మీరు పడే పోటీ కూడా గొప్పదై ఉండాలి!”
“అర్థంలేని వాదనల్లో తలదూర్చి మీ విలువను తగ్గించుకోవద్దు!”
మరో అద్బుతమైన కథ, తప్పకుండా వినండి – Telugu Moral Stories