ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మనల్ని ప్రేమించిన వారిపట్ల నిర్లక్ష్యం చూపకూడదు – Moral Stories in Telugu
మనల్ని ప్రేమించిన వారిపట్ల నిర్లక్ష్యం చేయకుండా వారి కష్టానికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం.
ఒకసారి, అనిత తన తల్లితో గొడవ పడింది. ఆ గొడవ తరాస్తాయికి చేరి తల్లిపై ద్వేషం పెంచుకుని ఇంటిని వదిలి వెళ్లడం మంచిదని భావించింది. ఆ రాత్రి చలిగాలుల నడుమ ఆమె ఇంటినుండి వెళ్ళిపోయింది. ఒక్కచోట ఆగి రోడ్డు పక్కన ఫూట్ పాత మీద కూర్చుని వుంది. ఆ కోపంలో బయటకి అయితే వెళ్ళిపోయింది కానీ, గొడవ కారణంగా ఆ రోజంతా ఏమి తినక ఆమెకి చాలా ఆకలి వేస్తుంది.
ఆ రోడ్డు పక్కనే ఒక నూడుల్స్ షాప్ కనిపించింది, కానీ ఆమె వద్ద ఒక్క రూపాయి కూడా లేదు. షాప్ అతను ఆమెను గమనించాడు. అతను ఆమెను లోపలికి ఆహ్వానించి నూడిల్స్ ప్రిపేర్ చేసి తినమని ఇచ్చాడు. అనిత అతనికి, “నా దగ్గర డబ్బులు లేవు” అని చెప్పింది.
ఆ షాప్ అతను నవ్వుతూ, “నాకు డబ్బు ఇవ్వనవసరం లేదు. ఫస్ట్ నూడిల్స్ తిను అన్నాడు.” తను ఆ షాప్ అతనికి థాంక్స్ చెప్పి ఆ నూడిల్స్ తినసాగింది.
నూడుల్స్ తింటూ, తన కథను చెప్పింది. షాప్ అతను, “ఒక ప్లేట్ నూడుల్స్ ఇచ్చినందుకు నువ్వు నాకు మనస్పూర్తిగా థాంక్స్ చెప్పావు. కానీ నీ తల్లి నిన్ను పెంచింది, ఎన్నో సార్లు మంచి ఆహారాలు వండి పెట్టింది. ఆమెకు నువ్వు ఎంతగా కృతజ్ఞత తెలపాలి?” అని అడిగాడు.
“మన జీవితంలో ఉన్న మనుషులను, వారు మన కోసం చేసే పనులను కాలక్రమంలో మరిచిపోతాం. ఎంత చేసిన ఏమి చేయలేదు అనే అనుకుంటాం.. ఇంకా ఇంకా వారి నుండి ఆశిస్తాము.
అతని మాటలు విన్న అనిత తన తప్పు గ్రహించింది. వెంటనే తన ఇంటికి వెళ్ళి, తన తల్లిని క్షమాపణ కోరాలని నిర్ణయించుకుంది. ఇంటి దగ్గరకి చేరుకోగానే , తన తల్లి కంగారూ పడుతూ, గేటు వద్ద ఆమె కోసం వేచి చూస్తుంది.
జీవితాన్ని మార్చే పోస్ట్ – Most Inspiring Telugu Story
ఆ తృప్తి మరెందులోనూ లేదు.. !
నిజమైన సంతుప్తి ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?