అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మనకేం కావాలో క్లారిటీగా చెప్పగలగాలి – Moral Stories in Telugu
మా సుబ్బారావు
చాలా మంచోడు
ఆశైతే వుంది
కానీ సరైన పనే లేదు,
పనిచేసే ఆలోచనా లేదు.
పాపం
భగవంతుడికే జాలేసింది
వచ్చి ప్రత్యక్షమయ్యాడు
ఏం కావాలో కోరుకొమ్మన్నాడు.
సుబ్బారావుకు సంతోషమనిపించింది
స్వామీ !
నెను చల్లగా ఉండాలి
పైకి ఎదగాలి
నాతో పాటు నలుగురిని పైకి తీసుకెళ్ళగలగాలి
మరో చిన్న కోరిక
నాకు పెద్దగా శ్రమ ఉండకూడదు అన్నాడు
తధాస్తు అన్నాడు.
మరుసటి రోజు
సుబ్బారావును లిఫ్టు బోయ్ గా మార్చారు
మళ్ళీ భగవంతుని ప్రార్ధించాడు సుబ్బారావు
మరలా ప్రత్యక్షమయిన భగవంతుడు
ఏమి భక్తా !
ఏమయింది అన్నాడు.

స్వామి ఎదగటమంటే
లిఫ్టులో పైకి నలుగురుని తీసుకెళ్ళటం కాదుగా
కంటి ముందు డబ్బులుండాలి అన్నాడు
తధాస్తు అంటూ మళ్ళి మాయమయ్యాడు స్వామి
మరుసటి రోజు
సుబ్బారావుకు ATM వద్ద వాచ్ మెన్ గా కూర్చోబెట్టారు
కంటిముందు ఇరవైనాలుగు గంటలూ డబ్బులుంటాయి
అందరూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు
కానీ
మన సుబ్బారావు మాత్రం వాచ్ మానే
సుబ్బారావు
మళ్ళీ భగవంతుని ప్రార్థించాడు
ఏం భక్తా !
ఇబ్బంది పడుతున్నట్టున్నావ్ ..
ఏమయింది అన్నాడు
ఏమవటమేంటి సామీ !
ఏదడిగినా మరేదో ఇస్తావ్ !
ఎలా సామీ అన్నాడు
కంటి ముందు డబ్బులన్నావుగా ఇచ్చాను అన్నాడు స్వామి
కంటి ముందు అంటే ATMకాదు
నా టేబిల్ మీదకు రావాలి అన్నాడు
నీవు ఏ పనీ చేయవు కదా భక్తా!
అందుకే అటువంటి పని కల్పించాను
అంత చికాకు పడకుండా ఆఖరు సారిగా అడుగు అన్నాడు స్వామి
నాకు పని చేయటం రాదు
ప్రతివాడు నా దగ్గరకే రావాలి
వాడి పని వాడే చేసుకుని వెళ్ళాలి
కానీ
నా టేబిల్ మీదకు డబ్బు రావాలి
తధాస్తు అన్నాడు
అమూల్యమయిన మూడు నీతి సూక్తులు – Moral Stories in Telugu
మరుసటీ రోజు సుబ్బారావుకు
సులబ్ సౌచాలయ్ దగ్గర కూర్చునే అదృష్టం దక్కీంది
ఎవరి పని వారే చూసుకుంటారు
టేబిల్ పై డబ్బులు పెట్టి వెళతారు
సుబ్బారావు మళ్ళి ప్రార్థించాడు
భగవంతుడు రాలేదు
ముగింపు
మనం అడిగేటప్పుడు
ఎవరినైనా సరే..
పూర్తిగా అర్ధమయ్యెటట్లుగా అడగాలి
లేదా..
మన పని మనం చేసుకోవాలి
మన శక్తీ~ఆలోచనల కన్నా మించిన విషయం ఇంకేముంటుంది
పనీయే ధైవం
ధైవమే పని
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com