ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తొందరపడి శిక్షించకూడదు – Moral Stories in Telugu
సింహపురి రాజ్యాన్ని హేమవర్మ పాలించే రోజుల్లో, రత్తమ్మ రాగయ్య దంపతులుండేవారు. వారి కూతురుకి పెళ్ళి నిశ్చయమైంది. కావలసిన బంగారంతా తెచ్చేశారు.. ఓరోజు చూసుకుంటే పూలహారం లేదు ఇల్లంతా వెతికారు ఎక్కడా కనిపించ లేదు. ఎప్పటి నుంచో ఉన్నాడు వారి ఇంట పనిమనిషి పోలయ్య. వాడిమీద అనుమానమొచ్చి అడిగారు.
“కుయ్యో!మొర్రో” అంటూ మీరెక్కడ పెట్టుకునేది నాకేంతెలుసు . నేను తీసుకోలేదు”అన్నాడు పోలయ్య. ఇలా కాదని రాజ భటునకు పిర్యాదు చేశారు. వచ్చాడు”రెయ్!మర్యాదగా చెబితే దెబ్బలు తప్పుతాయి. ఇచ్చెయ్యరా పాపం వాళ్ళ ది పెళ్ళి “అన్నాడు చెట్టుకు కట్టేసి.
ఒక ఉద్యోగపు ఇంటర్వ్యూలో ఒక కఠినమైన ప్రశ్న అడిగారు – Interesting Stories in Telugu
“తెలియదంటే తెలియ దన్నాడు””వీడికి పెళ్ళి కెదిగిన కూతురుంది , దానికి కావాలని ఎత్తుకు పోయివుంటాడు.”అన్నది పళ్ళు పటపటా కొరుకుతూ.
“మీ పిచ్చిగాని దొంగ దొంగని ఒప్పుకుంటాడా?” అని తుక్కుబడా కొట్టేశాడు. ఇదే సందని ఇంటెల్లపాది కొట్టారు. మూర్చిల్లి పడిపోయాడు.
ముఖాన నీళ్ళు చల్లి తేరుకోనీ మళ్ళీ కొడతాము “అన్నాడు. అంతలో” అమ్మా!దండ దొరికింది బీరువా క్రిందకు పోయి వుండింది “అన్నది సంతోషంగా.
అందరూ నిర్ఘాంత పోయారు. “అయ్యో!వాడు దొంగ కాదే తొందరపడి కొట్టేశానే అని చింతిస్తూ, ఆసుపత్రికి తీసుకుపోయి మందులు ఇప్పించాడు.
“ఒరే! పోలయ్యా! నిర్దోషిని కొట్టాను నన్బు క్షమించరా! ఈ పాపం ఊరకే పోదురా “అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. పశ్చాత్తాపం తో నాలుగు రోజులు అన్నం మానివేశాడు.
“వృధాగా నిన్ను అనుమానించి కొట్టించినందుకు క్షమించమని వేడుకున్నారు కుటుంబం మొత్తం.”
జంజం కోదండ రామయ్య
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com