ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Medical Values in Ugadi Pachadi
ఉగాది పచ్చడి జీవితంలోని 6 వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంది. ఋతు మార్పుల కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.
ఈ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు:
బెల్లం, అరటిపండు: (తీపి) ఆనందం
వేప పువ్వు: (చేదు) దుఃఖం,
బాధ పచ్చి మిరపకాయలు ( కారం): వేడి,
కోపం ఉప్పు (ఉప్పు): ఉత్సాహం,
జీవిత సారం చింతపండు (పులుపు): నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులు.
వగరు (మామిడి): కొత్త సవాళ్లు.
తయారీ విధానం: ముందుగా వేపపూతను శుభ్రం చేసుకుని నీటితో కడగాలి. బెల్లాన్ని తురుముకోవాలి. కొబ్బరి, మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం చింతపండును నానబెట్టి రసం తీసి వడకట్టుకోవాలి. అనంతరం చింతపండు రసంలో బెల్లం వేసి.. కరిగే వరకూ కలపాలి.
అనంతరం ఉప్పు, కొబ్బరి ముక్కలు, మామిడికాయలో ముక్కలు, చెరకు ముక్కలు, వేసి కలపాలి. తర్వాత వేపపువ్వు, అరటిపండు ముక్కలు వేసుకుని కలిపితే చాలు.. పచ్చడి ఎక్కువ పలచగా కాకుండా చూసుకోండి.. నాలికపై పడగానే అన్నీ రుచులు నాలుకకు తెలియాలి.
జీవితం అంటే ఆరు రుచుల కలయిక అని, వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని పండగ పచ్చడి చాటుతుంది.
ఔషధ గుణాలు – Medical Values in Ugadi Pachadi
ఉగాది పచ్చడికి ఆయుర్వేద శాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’ ‘అశోకకళికా ప్రాశనం’అని పేర్లతో వ్యవహరించేవారు. ఋతు మార్పుల కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరప కాయలు, మామిడి కాయలు ఉపయోగించేవాళ్లు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
బెల్లంలోని తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకు, విజయానికి సంకేతం. వేపలోని చేదు దుఃఖానికీ, నష్టానికీ, ద్వేషానికీ అపజయానికీ సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడమే. త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు అనే ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం, ఆహారంలో ఉండే ఓ ఔషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాదు హిందూ పండుగలకు, ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని విశదీకరిస్తుంది.
ఋతు మార్పుల కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది – Medical Values in Ugadi Pachadi in Telugu