ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Matti Lyrics in Telugu – Save Soil – Ram Miriyala
నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు కన్నది
చెట్టు చేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువయినది
పురుగు, పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడయినది
పసుల, పక్షుల తోడుగా జీవం నేలపై పారాడింది
వట్టి మట్టేగా అంటావేమో
మనుగడ పుట్టేది గిట్టేది
మట్టిలోనే కదరా
మట్టే రా పుట్టుకకు ఆధారం, మోసేది నీ భారం
అన్నమయ్యి ఆకలి తీర్చే మమకారం
మట్టేరా ప్రాణమున్న బంగారం, జీవకోఠికి గర్భం వట్టిపోనియ్యకు నేలనుతీర్చుకొ ఋణం
దేశమంటే మట్టేనోయ్
మట్టి లేకుంటే మనిషెక్కడోయ్
సారం లేని మట్టిలో
నువ్వు సాగెట్ల సాగిస్తావోయ్
సాగుంటేనే సౌభాగ్యం
లేకుంటే నిలువలేదు ఏ రాజ్యం
తిండి, బట్ట, నీడకి
నిండు మట్టే రా మూలాధారం
మట్టే రా పుట్టుకకు ఆధారం, మోసేది నీ భారం
అన్నమయ్యి ఆకలి తీర్చే మమకారం
Matti Lyrics in Telugu – Save Soil – Ram Miriyala, Niluvellaa Purudosukuni Lyrics in Telugu