Maa Telugu Talliki Lyrics In Telugu – State Song Of Andhra Pradesh
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
గల గలా గోదారి… కదలి పోతుంటేను
గల గలా గోదారి… కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ… పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
అమరావతీ నగర… అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో… తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచియుండేదాక
రుద్రమ్మ భుజ శక్తి… మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి… కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం… నీ పాటలే పాడుతాం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.