అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Matakaari Bava Lyrics In Telugu – Folk Song
సుక్కల సీరె కట్టూకోని… సుక్క బొట్టు పెట్టూకోని
సుక్కల సీరె కట్టూకోని… సుక్క బొట్టు పెట్టూకోని
మోటబాయి నీళ్ళకొస్తిరో… నీ నీడ నన్ను నిక్కీ నిక్కీ సూడబట్టెరో
బిందె నడుంనెట్టుకొంటెరో… నీ సెయ్యి నన్ను గిల్లి గిచ్చినట్టుగుందిరో
మాటకారి బావ… నా పైట ఇడువు బావ
నేనొద్దొద్దంట గాని… నాకు ముద్దూగుంటది బావ
మాటకారి బావ… నా పైట ఇడువు బావ
నేనొద్దొద్దంట గాని… నాకు ముద్దూగుంటది బావ
గంపా సేత పట్టూకోని… గడ్డీ మోపు ఎత్తూకోని
గంపా సేత పట్టూకోని… గడ్డీ మోపు ఎత్తూకోని
గట్టూ మీద పోతా ఉంటెరో… సల్ల గాలి సెవుల గుస్సాగుస్సలు సెప్పబట్టేరో
కొడవలంచు కొంగు సిక్కెరో… నీ కోరమీసం గుచ్చీనట్టు ఝల్లుమందిరో
మాటకారి బావ… నా బాట ఇడువు బావ
నేనొద్దొద్దంట గాని… నాకు ముద్దూగుంటది బావ
మాటకారి బావ… నా బాట ఇడువు బావ
నేనొద్దొద్దంట గాని… నాకు ముద్దూగుంటది బావ
ఒంటికి నలుగు పెట్టూకోని… ఎంటికలు ముడేసుకోని
ఒంటికి నలుగు పెట్టూకోని… ఎంటికలు ముడేసుకోని
తానం జెయ్య తలుపు మూస్తెరో… నీ సూపు ఎరుపు బొట్టు లెక్క అంటుకుందిరో
ఉడుకు నీళ్లు పోసుకుంటెరో… నీ ఏళ్ళతోటి ఒళ్ళు పుణికినట్టు ఉందిరో
మాటకారి బావ… నా బాట ఇడువు బావ
నేనొద్దొద్దంట గాని… నాకు ముద్దూగుంటది బావ
మాటకారి బావ… నా బాట ఇడువు బావ
నేనొద్దొద్దంట గాని… నాకు ముద్దూగుంటది బావ
నెత్తీ కింద మెత్త పెట్టి… మస్కెటు సెద్దరు మస్తుగ సుట్టి
నెత్తీ కింద మెత్త పెట్టి… మస్కెటు సెద్దరు మస్తుగ సుట్టి
బొంతా మీద పండుకుంటెరో… నీ గుండెల మీద మెత్తగ ఒరిగినట్టు ఉందిరో
తెల్లారంగ లేసి సూస్తెరో… నీ సెమట సుక్క పక్కను తడిపినట్టు ఉందిరో
మాటకారి బావ… ఇగ ఆగాలేను బావ
నేమొత్తూకున్న గాని… నన్ను ఎత్తుకు పోరా బావ
మాటకారి బావ… ఇగ ఆగాలేను బావ
నేమొత్తూకున్న గాని… నన్ను ఎత్తుకు పోరా బావ