Menu Close

Manasuna Manasuga Song Lyrics In Telugu – Love Birds

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం… పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే… కన్నుల్లో నీవే, రావా ||2||

మేఘం నేల ఒళ్ళో మీటే రాగమల్లే… ప్రేమా వరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొను… కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండెకోవెల విడిచి వెళ్ళ తగునా, తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
నిరీక్షించు స్నేహం కోరి జతనై రానా, రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట

మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం… పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే… కన్నుల్లో నీవే, రా

పువ్వై నవ్వులని తేనై మాధురిని… పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల… పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం… కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా… ఒక్క క్షణమై, క్షణమై
నువ్వు నేను చెరి సగమవుదాం… వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం… పలికింది మధుగీతం
తుదే లేని ఆనందం… వేచేనే నీ కోసం

మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం… పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే… కన్నుల్లో నీవే, రా

Like and Share
+1
2
+1
7
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading