Menu Close

Manasuna Edho Raagam Song Lyrics In Telugu – Yentavadu Gaani – మనసున ఏదో రాగం లిరిక్స్

Manasuna Edho Raagam Song Lyrics In Telugu – Yentavadu Gaani – మనసున ఏదో రాగం లిరిక్స్

మనసున ఏదో రాగం… విరిసెను నాలో తేజం
చెప్పలేని ఏదో భావం… నాలో కలిగెలే
సంద్రపు అలలే పొంగి… తీరం తాకే వేళ
మునిగే మనసు… అసలు బెదరలేదులే
ఉన్నది ఒక మనసు… వినదది నా ఊసు
నను విడి వెళ్ళిపోవుట… నేను చూసానే
తియ్యని స్వప్నమిది… చెరగని మనోనిధి
కలలో కలలో… నను నేనే చూసానే

నాకేం కావాలి నేడు… ఒక మాట అడిగి చూడు
ఇక నీవే నాకు తోడు… అని లోకమనేదెపుడు
నాకేం కావాలి నేడు… ఒక మాట అడిగి చూడు
ఇక నీవే నాకు తోడు… అని లోకమనేదెపుడు

దోసిట పూలు తెచ్చి… ముంగిట ముగ్గులేసి
మనసును అర్పించగ… ఆశ పడ్డానే
వలదని ఆపునది… ఏదని అడిగే మది
నదిలో ఆకు వలె… కొట్టుకు పోయానే

గరికలు విరులయ్యే మార్పే అందం
ఎన్నో యుగములుగా… మెలిగిన బంధం
ఒక వెండి గొలుసు ఓలె… ఈ మనసు ఊగెనిపుడు
తొడగాలి వజ్రమల్లె… నే మెరుయుచుంటినిపుడు
ఒక వెండి గొలుసు ఓలె… ఈ మనసు ఊగెనిపుడు
తొడగాలి వజ్రమల్లె… నే మెరుయుచుంటినిపుడు

మనసున ఏదో రాగం… విరిసెను నాలో తేజం
చెప్పలేని ఏదో భావం… నాలో కలిగెలే
సంద్రపు అలలే పొంగి… తీరం తాకే వేళ
మునిగే మనసు… అసలు బెదరలేదులే
ఉన్నది ఒక మనసు… వినదది నా ఊసు
నను విడి వెళ్ళిపోవుట… నేను చూసానే
తియ్యని స్వప్నమిది… చెరగని మనోనిధి
కలలో కలలో… నను నేనే చూసానే

ఒక వెండి గొలుసు ఓలె… ఈ మనసు ఊగెనిపుడు
తొడగాలి వజ్రమల్లె… నే మెరుయుచుంటినిపుడు.. ..

Manasuna Edho Raagam Song Lyrics In Telugu – Yentavadu Gaani – మనసున ఏదో రాగం లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading