Menu Close

దిగజారుతున్న సమాజం – Major Social Problems

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

దిగజారుతున్న సమాజం – Major Social Problems

క్షీణిస్తున్న విలువలు
దిగజారుతున్న సమాజం

తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు
పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు
పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు
ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు
ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు

Major Social Problems

భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త
ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య
నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి
ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి
తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు
ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు

వేరేకులంవాడిని వివాహమాడిందని
సోదరిని సంహరిస్తున్న సహోదరులు
మరోమతంవారిని మనువాడాడని మట్టుబెడుతున్న బంధువులు
వెల్లువవుతున్న విడాకులు

పేట్రేగిపోతున్న పదవీకాంక్ష
ఆధునికత అవధులు దాటిపోతోంది
అనుభవం పరిధులు మించిపోతుంది
వ్యక్తిగత స్వేచ్ఛ విశృంఖలమయ్యింది
అక్రమాలు అంబరమంటాయి
ఘోరాలు గొప్పలుపోతున్నాయి
అలుముకుంటున్న అరాచక రీతులు
ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు
వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు

స్వేచ్చాజీవనమని సంబరపడుతున్నాం
సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం
ఆటవికత ఆవరిస్తోందని
అరాచకత్వం అలుముకుంటోందని
గ్రహించలేకపోతున్నామా?

అందుకనే విలువలతో కూడిన విద్య,
నైతిక విలువలతో జీవన విధానము,
చిన్న, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు,
నేర్పండి.

మీ పెంపక లోపమే నేడు సమాజంలో
జరుగుతున్న వికృతాలు
అవగతంకాని అయోమయంలో ఉన్నాం..

ఇవి కూడా చదవండి
నేటి బంధాల్లో బలమెంత..?
ఓ తరం ఆడవారి జీవితాలు.

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading