ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మధురమే ఈ క్షణమే ఓ ఓ చెలి… మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ ఓ చెలి… మధురమే వీక్షణమే
మధురమే లాలసయే… మధురం లాలనయే
మధురమే లాహిరినే… మధురం లాలితమే
మధు పవనం వీచి… మధు పవనం వీచి
పరువమే మైమరచిందిలే…
కాలం పరుగులు ఆపి… వీక్షించే అందాలే
మొహం తన్మయమొంది… శ్వాసించే గంధాలే
ఊరించే రుచులని మరిగి… ఉడికించి తాపాలే
ఉప్పొంగి ఊపిరి సెగలో… కవ్వించే దాహాలే
మౌనంగా మధువుల జడిలోనా… పులకించే ప్రాణాలే
మధురమే ఈ క్షణమే ఓ ఓ చెలి… మధురమే ఈ క్షణమే
వీచే గాలులు దాగి… చెప్పేనే గుసగుసలే
చూసే ముసిముసి నవ్వులు… చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట… అరుదెంచి ఆకాశం
సగమై సాగరమందే… అగుపించే ఆసాంతం
తీరం ముడివేసిన దారం… తీర్చే ఎద భారాలే
మధురమే ఈ క్షణమే ఓ ఓ చెలి… మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ ఓ చెలి… మధురమే వీక్షణమే
మధురమే లాలసయే… మధురం లాలనయే
మధురమే లాహిరినే… మధురం లాలితమే
మధు పవనం వీచి… మధు పవనం వీచి
పరువమే మైమరచిందిలే…