“మా” (Movie Artist Association) కు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో 883 మందికి ఓట్లు ఉన్నాయి. ఇందులో 605 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్లు పోటీ చేయగా, మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలను ఈరోజు ప్రకటించారు. ఫలితాల ప్రకారం ఎగ్జిక్యూటీవ్ అధ్యక్షుడిగా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ ఎంపికయ్యారు.
జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్, గౌతమ్ రాజ్‌లు ఎంపికవ్వగా, వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల రవి, బెనర్జీలు ఎంపికయ్యారు. ఇక ఇదిలా ఉంటే మొత్తం 18 మంది ఈసీ మెంబర్లుగా గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఇందులో 10 మంది మంచు విష్ణు ప్యానల్ నుంచి ఎంపికవ్వగా, ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి 8 మంది ఎంపికయ్యారు. శివారెడ్డి, గీతాసింగ్, అశోక్ కుమార్, బ్రహ్మాజీ, శ్రీలక్ష్మి, మానిక్, ప్రభాకర్, తనీష్, శ్రీనివాసులు, హరినాథ్ బాబు, సురేష్ కొండేటి, శివనారాయణ, సంపూర్నేష్‌బాబు, శశాంక, సమీర్, సుడిగాలి సుధీర్, బొప్పాల విష్ణు, కౌశిక్ లు ఈసీ మెంబర్లుగా విజయం సాధించారు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.