Menu Close

Budget 2024 Highlights – బడ్జెట్ గురించి పూర్తి వివరంగా – మార్పులు, చేర్పులు

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Budget 2024 Highlights – బడ్జెట్ గురించి పూర్తి వివరంగా – మార్పులు, చేర్పులు

Budget 2024 Highlights

విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణాలు:

విద్యార్థులకు దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలను అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘ప్రభుత్వ పథకాలు, విధానాల కింద ఎటువంటి ప్రయోజనం పొందడానికి అర్హత లేని మన యువతకు సహాయం చేయడానికి ప్రభుత్వం దేశీయ సంస్థలలో ఉన్నత విద్య కోసం రూ .10 లక్షల వరకు రుణాలకు ఆర్థిక మద్దతును ప్రభుత్వం అందిస్తుంది’’ అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాల కోసం ఈ-వోచర్లను ఏటా లక్ష మంది విద్యార్థులకు అందించనున్నారు. ఈ వోచర్లు రుణ మొత్తంపై 3% వార్షిక వడ్డీ రాయితీని కవర్ చేస్తాయి.

తొలి సారి ఉద్యోగంలో చేరిన వారికి ఆర్థిక సాయం:

ఫార్మల్ సెక్టార్ లో తొలి సారి ఉద్యోగంలో చేరిన వారికి వారి నెల జీతం ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఆధారంగా రూ. 15 వేల వరకు, మూడు విడతల్లో, నేరుగా నగదు బదిలీ చేస్తామని ప్రకటించారు. ఈ పథకం వల్ల 2.1 కోట్ల మంది యువత లబ్ధి పొందుతారని తెలిపారు.

స్టార్ట్ అప్స్ కు గుడ్ న్యూస్:

ఏంజిల్ టాక్స్ ను రద్దు చేస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. స్టార్ట్ అప్స్ లో, వాటి మార్కెట్ వాల్యూని మించి ఏంజిల్ ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులపై ఈ పన్ను విధిస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ లో మనీ లాండరింగ్ ను నిరోధించడం కోసం దీనిని 2012లో ప్రవేశపెట్టారు. తాజాగా, ఈ టాక్స్ ను రద్దు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ తెలిపారు.

యువతకు నెలకు రూ. 5 వేల అలవెన్స్:

ఐదేళ్లలో కోటి మంది యువతకు ప్రయోజనం చేకూర్చే ఇంటర్న్షిప్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా టాప్ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్ షిప్ అందిస్తారు. వారికి సంవత్సరం పాటు నెలకు రూ. 5 వేలు ఇంటర్న్ షిప్ అలవెన్స్ ఇస్తారు. వన్ టైమ్ అసిస్టెన్స్ గా మరో రూ. 6 వేలు ఇస్తారు. శిక్షణ ఖర్చులు, ఇంటర్న్షిప్ ఖర్చుల్లో 10 శాతాన్ని సీఎస్ఆర్ నిధుల నుంచి కంపెనీలు భరిస్తాయి.

ఈ వస్తువుల రేట్లు తగ్గుతాయి:

కస్టమ్స్ సుంకం తగ్గింపు వల్ల పలు దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు వల్ల కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, మొబైల్ ఫోన్స్, చార్జర్స్, బంగారం, వెండి, ప్లాటినం, లెదర్ గూడ్స్, సీ ఫుడ్ ప్రొడక్ట్స్.. ధరలు తగ్గనున్నాయి.

తగ్గనున్న బంగారం, వెండి ధరలు:

కేంద్ర బడ్జెట్ లో దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. దీంతో బంగారం, వెండి, ప్లాటినం ధరలు తగ్గనున్నాయి. బంగారం, వెండి పై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీని 6.5 శాతానికి తగ్గించారు.

స్టాండర్డ్ డిడక్షన్ పెంపు:

ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించి ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. స్టాండర్డ డిడక్షన్ ను రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

తగ్గనున్న మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు:

మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీబీఏ, మొబైల్ ఛార్జర్లపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. దేశీయంగా స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని, మొబైల్ ఫోన్ల ఎగుమతులు దాదాపు 100 రెట్లు పెరిగాయని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​:

లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​పై 12.5శాతం పన్ను
లిస్టెట్​ ఫైనాన్షియల్​ అసెస్ట్స్​ని ఏడాది కన్నా ఎక్కువ హోల్డ్​ చేస్తేనే అది లాంగ్​ టర్మ్​ అవుతుంది.

ద్రవ్య లోటు:

జీడీపీలో ద్రవ్య లోటు అంచనా 4.9శాతం : నిర్మలా సీతారామన్​

బిహార్​పై ఫోకస్​:

రూ.21,400 కోట్ల వ్యయంతో పీర్ పాయింటి వద్ద 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టబడతాము. బిహార్​లో కొత్త విమానాశ్రయాలు , వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు.

బహుళపక్ష అభివృద్ధి బ్యాంకుల నుంచి బాహ్య సహాయం కోసం బీహార్ ప్రభుత్వ అభ్యర్థనలను వేగవంతం చేస్తారు.

గయాలో ఇండస్ట్రియల్ నోడ్: బీహార్ లోని గయ నగరాన్ని తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నోడ్ గా అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పాట్నా – పూర్ణియా ఎక్స్‌ప్రెస్ వే, బక్సర్ – భాగల్పూర్ హైవే, బోధ్గయా – రాజ్గిర్ – వైశాలి – దర్భాంగా, బక్సర్లో గంగా నదిపై రూ. 26,000 కోట్లతో అదనపు రెండు వరుసల వంతెన అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తామని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారు.

ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ ద్వారా బీహార్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

టూరిజంలో భాగంగా టెంపుల్ కారిడార్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

జీఎస్టీ:

జీఎస్టీ ట్యాక్స్​ స్ట్రక్చర్​ని మరింత సరళతరం చేసేందుకు కృషి చేయనున్నట్టు నిర్మల తెలిపారు. వాస్తవానికి జీఎస్టీ వ్యవస్థ భారీ సక్సెస్​ సాధించి, ప్రజలకు లబ్ధిచేకూర్చిందని అన్నారు.

టూరిజం:

నలందని టూరిస్ట్​ హబ్​గా మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది.
విష్ణుపాద, మహాబోది ఆలయాలను అభివృద్ధి చేస్తుంది.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం ఒడిశాకు ఆర్థిక సాయం.

బిహార్​కు ‘ఇన్​ఫ్రా’ వరం:

బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. బడ్జెట్​లో మాత్రం మౌలికవసతుల వర్షాన్ని కురిపించింది. రోడ్లు, వంతెనలు, ప్రకృత్తి విపత్తు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్​ తెలిపారు.

పేదలకు ఇళ్లు:

పట్టణాల్లో నివాసముండే పేదలకు ఇళ్ల కోసం రూ. 10లక్షల కోట్లను వెచ్చించనున్నట్టు నిర్మల తెలిపారు.

ఏపీకి నిర్మల వరాలు:

కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్‌కు దక్కాల్సిన సాయంపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది రూ. 15 వేల కోట్ల సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే పోలవరం నిర్మాణానికి బకాయిలు ఇస్తామని చెప్పారు. పారిశ్రామిక ప్రగతికి వీలుగా రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

వీటితో పాటు వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన అభివృద్ధి నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మౌలిక వసతులు ముఖ్యంగా నీటిపారుదల, విద్యుత్తు సరఫరా, రహదారుల నిర్మాణానికి సాయపడతామని చెప్పారు.

ముద్ర రుణాల లిమిట్​ పెంపు:

గతంలో ముద్ర రుణాలు తీసుకుని, సమయానికి తీర్చిన వ్యాపారులకు ఈసారి లోన్​ లిమిట్​ని పెంచుతున్నట్టు నిర్మల తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం:

రెండేళ్ల వ్యవధిలో 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లిస్తామని నిర్మల స్పష్టం చేశారు

వ్యవసాయం కోసం రూ. 1.52లక్ల కోట్లు:

ఈ దఫా బడ్జెట్​లో వ్యవసాయం, అనుసంధాన రంగాలకు రూ. 1.52 లక్షల కోట్ల బడ్జెట్​ని కేటాయించినట్టు నిర్మల తెలిపారు.

పంటకు మద్దతు ధర:

దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలను పెంచినట్టు నిర్మల తెలిపారు. కనీసం 50శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలను సవరించినట్టు అన్నారు.

Budget 2024 Highlights – బడ్జెట్ గురించి పూర్తి వివరంగా – మార్పులు, చేర్పులు

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading