పెళ్ళికిముందు అమ్మాయిలకు మాత్రమే వినిపించే మాటలివి – Life Style of Women in India
దాదాపు ప్రతి అమ్మాయి తాను స్త్రీగా పుట్టినందుకు జీవితంలో కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తాయి. మరి అందరి జీవితాల్లో ఆ హెచ్చరికలు వర్తిస్తాయా? అంటే అవునని చెప్పలేం.. అయితే అవి విన్నాక ఆడవాళ్ల జీవితం అంత సులువు కాదు.. చాలా కఠినం.. అనే భావన కలుగుతుంది.

- నీ ఆటలు ఇక్కడే.. రేపు పెళ్లయ్యాక అత్తగారింట్లో ఇవన్నీ నడవవు.
- నువ్వు అత్తగారింట్లోనూ ఇలాగే ఉంటే ‘ఆడపిల్లని పెంచేది ఇలాగేనా అని మమ్మల్ని అంటారు’
- రేపు నీకు పెళ్లయి, ఆడపిల్ల పుడితే మా బాధ తెలుస్తుంది.
- వంటావార్పు రాకపోతే అత్తగారింట్లో ఏం వండి పెడతావ్?
- నీకు పెళ్లయ్యాక అత్తగారింటికి వెళ్తేగానీ నీకు అమ్మ విలువ తెలిసిరాదు.
- మామీద అరిచినట్లు అత్తగారింట్లో అరిస్తే కుదరదు.
- రేపు పెళ్లయ్యాక వచ్చే ఆడపడుచులు మీ అక్కాచెల్లెళ్లలా ఉండరు.
- మగాడు అన్నాక లక్ష అంటాడు.. నువ్వు సర్దుకుపోవాలి.. ఎదురు మాట్లాడకూడదు.
ఓ తరం ఆడవారి జీవితాలు – Women in India
International Women’s Day Telugu Quotes | Telugu Wishes | Telugu Greetings
Like and Share
+1
+1
+1