ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Life Lessons You Can Learn From Lord Ganesha
మనం పండుగ జరుపుకుంటే
ఆ పండుగ వెనుక వున్న అంతరార్ధం
మన తరువాత తరాల వారికి తెలియచెయ్యాల్సిన
బాద్యత మనపై వుంది అని మనం గుర్తించాలి.
ప్రతి పండుగ వెనుక ఎన్ని రహస్యాలు, శాస్త్రం దాగి వుంది.
దానిని మనం అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
అలానే వినాయక చవితి పండుగ కూడా
ఒకప్పుడు వినాయక మూర్తిని పసుపుతో చేసి
వివిద రకాల ఆకులు పెట్టి కొన్ని రోజుల తరవాత
మంచి నీటి చెరువులో నిమర్జనం చేసే వారు.
అప్పటికే వర్షాలు పడి చెరువు నిండుగా వుండేది.
దాని వల్ల మంచి నీరు శుద్ది అయ్యేవి.. వూరి ప్రజలంతా ఆ నీరే తాగే వారు.
ఇప్పుడు మనం చేస్తున్నదేంటో మనకి తెలుసుగా
మన అజ్ఞానం ఏ స్తాయికి వెల్లిందో తెలుసుగా..
ఇవి మనం మన పిల్లలకి చెప్పము..
ఇవే కాదు, ఆ దేవుడి గురుంచి మన పిల్లలకి మనం ఏం చెప్తున్నామ్?
అసల మన పిల్లలకి ఏమి తెలుసు? మనకి ఏమి తెలుసు?
ఆ దేవుడు నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషియాలు ఇవి
మన బాధ్యతలను ఎప్పుడు మనం మరువరాదు.
మనకు శివుడు వినాయకుని శిరచ్చేధం చేయటం, ఏనుగు తలకాయ తగిలించడం గురించిన కధ తెలిసినదే! ఈ కధ ద్వారా మనకు కర్తవ్యం మరియు బాధ్యత అన్నిటికన్నా ముఖ్యమైనవని తెలుస్తుంది. వినాయకుడు తన తల్లి అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి, తన శిరస్సును త్యాగం చేసాడు.
పరిమిత వనరులను, ఉత్తమంగా వినియోగించుకోవాలి.
మనలో చాలామంది ,ఎప్పుడు మనకు తక్కువైన వాటి గురించి చింతిస్తుంటాం. కానీ గణేశ, కార్తికేయుల మధ్య జరిగిన పందెం పరిమితులున్నప్పుడు, వనరులను ఎంత సమర్ధవంతంగా వినియోగించుకోవాలో తెలియజేస్తుంది. ఈ కధ ప్రకారం, వినాయక, కార్తిజేయులకు మధ్య వారి తల్లిదండ్రులు ముల్లోకాలను మూడుసార్లు ఎవరు ముందుగా చుట్టూ వస్తారో అని పోటీ పెట్టారు.
ముందుగా వచ్చిన వారికి అద్భుతమైన ఫలం లభిస్తుందని చెప్పారు. కార్తికేయుడు తన వాహనమైన నెమలిపై వెంటనే బయలుదేరాడు. వినాయకుడు సందేహంలో పడ్డాడు. తన చిట్టి ఎలుక సహాయంతో ఆ సవాలును స్వీకరించలేక, తల్లితండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, ముల్లోకాలను మూడుసార్లు చుట్టిన ఫలితాన్ని పొందాడు.
మంచి శ్రోతగా ఉండాలి.
గణేశుని ఏనుగు చెవులు ప్రభావవంతమైన సంభాషణ క్రమానికి చిహ్నం. ఒక పరిస్థితిని సమర్ధవంతంగా చెక్కబెట్టడానికి ముందుగా, ఎదుటివారు చెప్పేది సక్రమంగా వినాలి. దీనివలన సమస్యను కూలంకషంగా అర్ధం చేసుకుని, సులభంగా, సమగ్రంగా విశ్లేషించి, సరైన నిర్ణయం తీసుకునే వీలు ఉంటుంది.
అధికారాన్ని అదుపులో పెట్టుకోవాలి.
హోదాతో పాటు మనకు కొన్ని ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. వీటితో పాటుగా మనకు గర్వం పెరుగుతుంది. వినాయకుని తొండం పైకి ముడుచుకుని ఉంటుంది. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే తత్వం దీనిని చూసి నేర్చుకోవాలి. మన అధికారాలను అదుపులో పెట్టుకుని మంచికై వాటిని వినియోగించాలి.
క్షమాగుణం అలవర్చుకోవాలి.
ఒకనాడు వినాయకుడు ఒక విందుకు హాజరయ్యి అతిగా ఆరగించాడు. విందు నుండి తిరిగి వస్తున్న వినాయకుని పొట్టను చూసి చంద్రుడు ఫక్కున నవ్వాడు. అంతట, వినాయకుడు చంద్రుని అదృశ్యమైపోమని శాపమిచ్చాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న చంద్రుడు వినాయకుని క్షమాపణ కోరుకుంటాడు.
శీఘ్రమే శాపవిమోచన కలిగించిన వినాయకుడు, ప్రతినెలా చంద్రుని కళ తగ్గుతూ వచ్చి ఒకరోజు పూర్తిగా అంతర్ధానమవుతాడని సెలవిచ్చాడు. క్షమాగుణం వినాయకుని చూసి మనం అలవర్చుకోవాలి.
వినయంతో మేలుగుతూ, ఇతరులను గౌరవించాలి
దీనికి ఉత్తమ ఉదాహరణ వినాయకుని వాహనం. కొండ అంతటి వినాయకుడు, చిన్న ఎలుకపిల్లను అధిరోహించి ముల్లోకాలలో సంచరిస్తాడు. దీనిని బట్టి ఆయన చిన్న జీవిని అయినప్పటికీ ఎలుకను కూడా గౌరవించి, మర్యాద ఇస్తారు అని తెలుస్తుంది. ఇది మనమందరం తప్పక అనుసరించాల్సిన లక్షణం. అలా అయితేనే మనం జీవితంలో మంచి స్థాయికి చేరుకోవచ్చు.
సంయమనాన్ని కోల్పోకూడదు
మహా ధనవంతుడైన కుబేరుడు (Kuberadu) శ్మశానంలో ఉండే శివునికి తన దర్పాన్ని, సంపదలని చూపించాలనుకున్నాడు. తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని శివుడికి ఆహ్వానం పలికాడు. శివుడు తనకు వీలుపడదని, తన కుమారుడు వినాయకున్ని పంపాడు. గణేశుడికి కుబేరుడి మనస్సులో ఏముందో అర్థమైంది.
సరే నువ్వు తినడానికి ఎంత పెడ్తావో చూస్తా అన్నట్లు కూర్చొన్నాడు. కుబేరుడు ఆడంబరంగా వడ్డిస్తుంటే… పెట్టినవి పెట్టినట్టు తినేశాడు వినాయకుడు. కుబేరుని దగ్గర అన్నీ అయిపోయాయి. అప్పుడు కుబేరునికి గర్వభంగం అయ్యింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోకూడనేది ఇక్కడ విఘ్నేశ్వరుడు మనకు చెప్పే నీతి.
ఆత్మ గౌరవం:
ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తూ.. స్వర్గలోకానికి గణేషున్ని కాపలాగా ఉంచుతారు. దీనికి కారణం తన ఆకారమే అని గణేశుడికి తెలుస్తుంది. ఎలాగైనా దేవతలకు గుణపాఠం చెప్పాలనుకుని.. వారు వెళ్లే అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారిలో గుంతలు చేయడంతో.. ఆ గుంతల్లో దేవతల రథం దిగబడుతుంది.
అప్పుడు దీనికి కారణం అవరోధాలను తొలగించే దైవం వినాయకుడిని ప్రార్ధించడమే అని చెప్పడంతో దేవతలకు తమ తప్పు తెలుస్తుంది. వినాయకుడి క్షమించమని కోరతారు. వినాయకుడు తన ఆత్మ గౌరవంతో ప్రవర్తించిన తీరు ఎట్టి పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
తప్పకుండా షేర్ చెయ్యండి