జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది – Life Lessons in Telugu
తిని ఖాళీగా కూర్చునే రోజులను
తినడానికి టైం దొరకని రోజులను
నిద్రపట్టని రాత్రులను,
నిద్రలేని రాత్రులను,
ఘోరమైన ఓటమిని,
ఘనమైన గెలుపుని,
ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని
పాతాళానికి తొక్కే మోసాన్ని
బాధలో తోడుగా ఉండే బంధాన్ని
బాధించే బంధువులను,
వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని,
ఎవరి కంటికి కనిపించని దీనావస్థని.
జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది
నీకు నచ్చినా నచ్చకపోయినా
వీటి అన్నింటినీ జీవితంలో
నువ్వు ఎదుర్కోవలసిందే…!!