Menu Close

జూలై 12, 13 న ఖగోళంలో అద్భుతం..మిస్ అవ్వకండి

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఖగోళంలో అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ఇంద్రధనస్సు సూర్యుడిని చుట్టేయగా చూపరులను అది ఎంతగానే ఆకట్టుకుంది. హెలీ తోక చుక్క మనకు డెబ్బై ఆరు సంవత్సరాలకు కనపడుతుంది.

అంటే మనిషి సగటు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఇలా ఖగోళంలో కొన్ని సందర్బాల్లో వింతలు జరుగుతూ ఉంటాయి.

Space news telugu bucket

వాటిని వీక్షించితే చెప్పలేని అనుభూతి వస్తుందని.. శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజాగా జూలై 12, 13 తేదీల్లో భమికి పక్కనే ఉన్న అంగారక, శక్ర గ్రహాలు అతి చేరువగా రానున్నాయి. అంత కాకుండా ఈ గ్రాహాలతో పాటు చందమామ కూడా దగ్గరగా కనిపించనుంది. ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా అరుదైన సందర్భాల్లో అవి భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు కుజ(అంగారక), శుక్రుల మధ్య ఎడం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుంది. ఈ రెండు గ్రహాలు, చందమామ.. పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం 8వ తేదీ నుంచే కనపడుతుంది.

3న మరింత దగ్గరగా కనిపిస్తాయి. వీటిలో రెండు గ్రహాలను ఎటువంటి టెలిస్కోపులు, బైనాక్యులర్ ల అవసరం లేకుండానే వీక్షించవచ్చని.. భారత దేశంలో ఎక్కడి నుంచైనా వీటిని వీక్షించవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తెలిపింది. జులై 13 తర్వాత అవి క్రమంగా దూరం అవుతాయని భావిస్తున్నారు. మరి ఇంకేం.. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించడానికి రెడీ ఉండండి.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading