Menu Close

Jagada Jagada Jagadam Song Lyrics In Telugu – Geethanjali


చమ్ చమ్, చమ్ చమ్ చమ్ చమ్……

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం… మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం… మా పిలుపే ఢమరుఖం

ఆడేదే వలపు నర్తనం… పాడేదే చిలిపి కీర్తనం
సై అంటే సయ్యాటలో, హే హే
మా వెనకే ఉంది ఈ తరం… మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢీ ఆటలో
నేడేరా నీకు నేస్తము… రేపే లేదు
నిన్నంటే నిండు సున్నరా… రానే రాదు
ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈ నాడె
తక తకదిమి తకఝం

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం… మా పిలుపే ఢమరుఖం

పడనీరా విరిగి ఆకసం… విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేనులే, హో హో
నడిరేయే సూర్య దర్శనం… రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము… మా సిధ్ధాంతం
పోరాటం మాకు ప్రాణము… మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం… మా జోరు చూసాక ఈ నాడె
తక తకదిమి తకఝం

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం… మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే, రంపంపం పం

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

తకిట తకిట తకిట తకధిమితక
తకిట తకిట తకిట తకధిమితక
తకిట తకిట తకిట తకధిమితక
తాం తాం తాం

Like and Share
+1
0
+1
3
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading