Menu Close

ప్రాణ భయంతో విమానం టైర్లను, రెక్కలను పట్టుకుని వేళ్లాడుతూ పారిపోవడానికి ప్రయత్నిస్తున్న అఫ్ఘానిస్తాన్ ప్రజలు

అసలు ఆఫ్ఘనిస్తాన్ లో ఎం జరుగుతుంది?

తాలిబన్లు అంటే ఎవరు?

అఫ్ఘానిస్తాన్ ప్రెసిడెంట్ రాజేనామా చేసి ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్ప చెప్పాల్సిన పరిస్తితులు రావడానికి కారణం ఏంటి?

అప్ఘానిస్థాన్ లో పరిస్థితి క్షణ క్షణానికి దిగజారుతోంది. తాలిబన్లు దేశంపై పూర్తి పట్టు సాధించడంతో ఆదేశ ప్రజలు బతుకు భయంతో పారిపోతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఉండదన్న భయంతో మూటా, ముల్లె సర్దుకుని దొరికిన విమానం చేతబట్టుకుని దేశం విడిచి వెళుతున్నారు. ఇతర ప్రావిన్సులను తాలిబన్లు ఆక్రమించగానే కాబూల్ కు వలస వచ్చిన ప్రజలు ఇప్పుడు కాబూల్ కూడా తాలిబన్ల వశం కావడంతో ఇక దేశం వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వేలాది మంది కాబుల్ విమానాశ్రయం రన్ వే పైకి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.

కొందరు విమానంలోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే టేకాఫ్ కావడంతో వారు గాలిలో విమానం టైర్లను, రెక్కలను పట్టుకుని వేళ్లాడుతూ కనిపించారు. విమానం గాల్లో ఎత్తుకు లేవగానే వారు కింద పడిపోయారు. జనం తొక్కిసలాటను నివారించేందుకు అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. ముందు తమ దౌత్య సిబ్బందిని అక్కడినుంచి తరలించేందుకు అమెరికా బలగాలు ప్రాధాన్యత నిస్తున్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టును యూఎస్ బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి.

అసలు తాలిబన్లు అంటే ఎవరు?

ఆఫ్ఘానిస్తాన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు.. ఆఫ్ఘానిస్తాన్ సైన్యం, ప్రభుత్వం తాలిబాన్ల దాటికి చేతులెత్తేయడంతో ఆఫ్ఘన్ ప్రజల పరిస్థితి ఇపుడు అగమ్య గోచరంగా మారింది. తాలిబాన్ల పాలనలో తాము ఉండలేము అంటూ ఇప్పటికే వేల మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘన్ లో ఉన్న ఒక్కగానొక్క అంతర్జాతీయ విమానంలో దేశం విడిచి వెళ్ళిపోడానికి వేల మంది పోటీ పడటంతో అక్కడి బలగాలు గాల్లోకి కూడా కాల్పులు జరిపాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఒక దేశాన్ని తమ సైన్యంతో అదుపులోకి తీసుకున్న తాలిబన్లు అసలు ఎవరు.., ఎలా వచ్చారో ఒకసారి చూద్దాం..!!

తాలిబాన్ అంటే పష్టున్ తెగలకి చెందిన వారు.. పష్టున్ అంటే విద్యార్థి అనే అర్ధం. 3 దశాబ్దాల క్రితం ఆఫ్ఘాన్ నుండి జర్మనీ సోవియెట్ దళాలు ఉపసంహరించుకోవడంతో దేశంలోని క్లిష్ట పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోడానికి అప్పటి తాలిబాన్ నాయకుడు ఒమర్ మహమ్మద్.. ఐఎమ్(ఇండియన్ ముజహుద్దిన్) టెర్రర్ సంస్థ సహాయంతో దేశంలోని పలు రంగాలపై పట్టు సాధించారు. తాలిబన్లు ఒక్కసారిగా దేశంలో పట్టురావడంతో మహిళలు చదువుకోవద్దని, తప్పనిసరిగా బుర్ఖాలు ధరించాలని ఇలా మహిళలపై ఆంక్షలు అమలు చేశారు.

2001 సెప్టెంబర్ 11న అమెరికాపై బిన్ లాడెన్ దాడి తరువాత ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకున్న బిన్ లాడెన్ ని అప్పగించడానికి అప్పటి ప్రెసిడెంట్ రాబ్బని వారికి అనుకూలంగా ఉండే తాలిబాన్ నాయకుడు ఇండియన్ ముజహిద్దిన్ కమాండర్ ఒమర్ మహమ్మద్ లు నిరాకరించడంతో 2001లో అమెరికా భద్రత బలగాలు ఆఫ్ఘానిస్తాన్ ని తమ నియంత్రణలోకి తీసుకున్నాయి.

దాదాపుగా 20 ఏళ్ళు తమ ఆధీనంలో ఉన్న తరువాత ఇటీవలే అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ను నుండి తమ భద్రత దళాలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు కేవలం నెలల వ్యవధిలోనే ఆఫ్ఘాన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవడంతో పాటు చివరకి దేశ సైన్యాన్ని, ప్రభుత్వాన్ని ఎదురించి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబాన్ల దగ్గర ఎంత డబ్బు ఉందో తెలిసి ప్రపంచ దేశాలు నిజంగానే షాక్ అయ్యాయి.

మైనింగ్, డ్రగ్స్, మారణ ఆయుధాల ద్వారా సుమారుగా ఏడాదికి 15,000 వేల కోట్ల ఆదాయాన్ని పొందుతున్నారు. రకరకాల సంస్థల నుండి వారికి వచ్చే విరాళాలతో తమ సైన్యాన్ని బలపరుచుకొని చివరికి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ తాలిబన్లు.

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading