Menu Close

బిగ్గెస్ట్ ఆఫర్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ జస్ట్ 999👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

థైరాయిడ్ ఉన్నవారు అసలు తినకూడని పదార్ధాలు-Health Tips

థైరాయిడ్ ఈ మధ్య చాలామందిలో కనిపిస్తున్న సమస్య. మన గొంతు దగ్గర మన గాలి గొట్టానికి సీతాకోక చిలుక ఆకారంలో ఆనుకుని ఉండేదాన్ని థైరాయిడ్‌ గ్రంథి అంటారు. శరీరం మొత్తం దీని కంట్రోల్ లో ఉంటుంది. పరిమాణంలో చిన్నదే అయినా దీని బాధ్యత కాస్త పెద్దదే. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ల ద్వారానే శరీరానికి చురుకుదనం వస్తుంది. గొంతు కింద ఉండే థైరాయిడ్‌ గ్రంధి అసహజంగా వాపుకు గురి కావడాన్నే గాయిటర్‌ అంటారు. ముఖ్యంగా ఇది అయోడిన్‌ లోపం వల్ల వస్తుంది.

ఇలా కొన్నిసార్లు థైరాయిడ్‌ గ్రంథి వాపు వస్తూ పోతుంటుంది ( ట్రాన్సియెంట్‌ థైరాయిడైటిస్‌ / Transient Thyroiditis ). వాపు ఉన్నప్పుడు థైరాయిడ్‌ హార్మోన్లు తగ్గిపోతాయి. వాపు తగ్గినపుడు తిరిగి మామూలు స్థాయికి వచ్చేస్తాయి. కొందరిలో వాపు అలాగే ఉండిపోవచ్చు కూడా. ఇలాంటి వారిలో శాశ్వతంగా హైపోథైరాయిడిజమ్‌ తలెత్తుతుంది. మహిళల్లో థైరాయిడ్ ప్రమాదం పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువ. బరువు పెరుగుతుంటే, గొంతులో వాపు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే థైరాయిడ్ గా గుర్తించాలి.

శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు హైపోథైరాయిడిజం, అధికంగా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం సంభవిస్తుంది. హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌థైరాయిడిజమ్‌ వంటివాటిని కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల తగ్గించుకోవొచ్చు. సరైన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కానీ ఈ ఆహారాలను మాత్రం థైరాయిడ్ రోగులు ఎప్పుడు తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.

హైపోథైరాయిడ్ ఉన్నవాళ్లు తీసుకోకూడని ఆహరం:

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వేయించిన ఆహారాలు, బంగాళాదుంపకు సంబంధించి ఆహారాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైనవి తినకూడదు. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉంటే కాలీఫ్లవర్, క్యాబేజీని తినకండి. ఈ కూరగాయలు, ఆకులలో కనిపించే గోయిట్రోజెన్లు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యను పెంచుతాయి. కనుక వాటిని ఆహారంలో చేర్చకపోవడమే మంచిది.

అధిక చక్కెర ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. టీ, కాఫీ వంటి కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. క్రమంగా మీ రక్తంలో థైరాయిడ్ స్థాయిని పెంచుతుంది. ఇది రోగి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.

థైరాయిడ్ ఉన్నవారు ఎర్ర మాంసాన్ని తినకూడదు. ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ రోగులకు హానికరం. ఈ కారణంగా శరీర ఉష్ణోగ్రత అసాధారణ స్థాయికి పెరుగుతుంది. అందుకే దీనిని నివారించాలి.

సోయాబీన్ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని, దాని సంబంధిత ఎంజైములను ప్రభావితం చేస్తుంది. ఫైటోఈస్ట్రోజెన్ అధికంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. గ్రీన్ టీలో యాంటి థైరాయిడ్ లక్షణాలను కలిగి ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే అధికంగా గ్రీన్ టీ తాగితే మాత్రం హైపో థైరాయిడిజం బారిన పడాల్సి వస్తోంది. అందువల్ల గ్రీన్ టీ తాగకపోవడమే మంచిది.

హైపర్ థైరాయిడిజంలో తినకూడనివి:

అధిక అయోడిన్ మరియు సెలీనియం ఉన్న ఆహారాన్ని తినవద్దు. చక్కెర లేదా చక్కెర అధికంగా ఉండే పానీయాలు లేదా శీతల పానీయాలు, చాక్లెట్, మిఠాయి వంటి ఆహారాన్ని తినవద్దు. చక్కెరకు బదులుగా మీ ఆహారంలో తేనెను కలుపుకోవచ్చు. బ్రెడ్, బిస్కెట్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ – బర్గర్స్, ఫ్రైస్ మరియు రోల్స్ వంటి ఆహారాన్ని తినవద్దు. పండ్ల రసం త్రాగ వద్దు, బదులుగా పండ్లు తినాలి.

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks