Menu Close

Kurravada Kurravada Lyrics in Telugu – 10th Class Diaries


Kurravada Kurravada Lyrics in Telugu – 10th Class Diaries

కన్నుల్లోనా దాచా నిన్ను
రోజూ ఎదుటనే చూడగా
శ్వాసల్లోనా మోసా నిన్ను
నువ్వే నాతోడై రాగా

వింటున్నా నిన్నటి
గురుతులన్ని తలచుకుంటూ
నీతో ప్రతి నిమిషం ఉంటూ
తిరిగేస్తున్నా నీ చేయి నేను పట్టుకుంటు
నీ కలలెన్నో కంటూ

కుర్రవాడ కుర్రవాడ నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడ కుర్రవాడ నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా.

ఓ, మబ్బులో సినుకే, ఏ ఏఏ
మన్నులోన మొలకలేసెలే
దూరమై ఉన్న నింగి నేల ఏకమయ్యెలే.

చిన్నారి చల్లగాలి ఉండుండి మీద వాలి
నీ వెచ్చనైన ఊపిరూదే ఇప్పుడే
సన్నంగ మంచు రాలి నా కురులపైన తేలి
నీలాగ అల్లరేదో చేసే గుప్పెడే

నువ్ ఎప్పుడొచ్చినా తెలియదు
చప్పుడైనా చేయకుండా
రెప్పలు మూసినావులే
ఓ కొత్త లోకమే మళ్ళీ
ప్రేమలోన చూపుతుంటే
చీకటైనా నాకు పండువెన్నెలే

కుర్రవాడ కుర్రవాడ… నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడ కుర్రవాడ… నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా

చీకటే కాదే… వేకువే వస్తుందిలే
గిర్రున తిరిగే భూమి నీదే
గెలుపు ఉందిలే.

నీ వేళ్ళు తాకినట్టి ఆ పుస్తకాలు తట్టి
ఆకాశమందుకోను రెక్కలొచ్చెనే
ఆశల్ని మూటకట్టి… పక్కన్నే కూర్చోబెట్టి
నువ్వన్న మాటలన్నీ బాటలయ్యెనే

నువు చెంత లేవనే సంగతి
ఇంత కూడా గురుతు రాదు
నా ఊహలన్ని నీవిలే

ఒక్కసారి నే చదివితే
మరచిపోను పాఠమైన
ప్రాణమెట్లా నేను మరువగలనులే

కుర్రావాడ కుర్రవాడ… నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రావాడ కుర్రవాడ… నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading