Menu Close

KCR గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. బండి సంజయ్-Telugu News


బండి సంజయ్ గారు తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా ప్రతి ఒక్కరి పై విమర్శలు గుప్పిస్తున్నారు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఇక, కేసీఆర్‌ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు..

  1. కేసీఆర్‌ జమానా – అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి?
  2. కేసీఆర్‌ గారు మీరు నివసిస్తున్న ప్రగతి భవన్‌ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు నిలయం’గా మారింది అన్నది వాస్తవం? దీనికి మీ సమాధానం ఏమిటి?
  3. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్‌ అని పేరుంది… దీనికి మీరు స్పందించి, మీ నిజాయితీని, సచ్ఛీలతను నిరూపించుకొంటారా?
  4. 2014లో మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా? దీనిపై చర్చకు మీరు సిద్ధమా?
  5. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా లేదా?
  6. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ ప్రాజెక్టుల, విద్యుత్ కొనుగోళ్లు, ప్రభుత్వ భూములు అమ్మకాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వీటికి సంబంధిచిన ఫైల్స్, సంబంధిత పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి దీనిపై చర్చించడానికి మీరు ముందుకు వస్తారా?
  7. మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఇసుక, లిక్కర్, డ్రగ్స్ దందాలు, భూకబ్జాలపై స్వతం సంస్థతో దర్యాప్తు జరిపించి అవినీతి, అక్రమాలు జరగడం లేదని మీరు నిరూపించుకోగలరా?
  8. మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఓటుకు – నోటు పథకాన్ని ప్రవేశపెట్టి మీరు సంపాదించిన కోట్ల రూపాయల అక్రమ సొమ్ముతో సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నమాట వాస్తవం కాదా?
  9. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను మీ అవినీతి సొమ్ముతో సంతలో సరకులాగా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మాట నిజం కాదా?
  10. బంగారు తెలంగాణ చేస్తానని, అక్రమ మార్గాల ద్వారా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ పార్టీ వారిని బంగారుమయం చేసి ప్రజలను బికార్లుగా మార్చిన ఘనత మీది కాదా..?

ఇలా బండి సంజయ్ కుమార్ గారు ప్రజల పక్షాన బీజేపీ తరఫున మరిన్ని ప్రశ్నలను మునుముందు సంధిస్తూ వుంటాం అంటూ పేర్కొన్నారు.

Share with your friends & family
Posted in Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading