ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇంతేనా ఇంతేనా… ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే…
ఇంతేనా ఇంతేనా… నీకైనా ఇంతేనా
మనసు లో లో… నిలువదే
నిదుర లేదు కుదురు లేదు… నిమిషమైనా నాకే
కదలలేను, వదలలేను… మాయ నీదేనా
మాటలైనా రానే రావు… పెదవిదాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా… నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం… సరిపోయేనా దేహం
నీతో సావాసం… నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయె… కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయె… మనసు తనువును తాకితే
ఎదురు చూడని స్నేహమే… ఎదురు వచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే… వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పలేకున్నా…
ఆ మాయలో… నేను ఉన్నా
ఎంత చూస్తున్నా… చాలలేద్దమ్మా నా కళ్ళలో దాగిపోవా…
ఇంతేనా ఇంతేనా… ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే… ఏ ఏ
ఇంతేనా ఇంతేనా… నీకైనా ఇంతేనా
మనసు లో లో… నిలువదే… ఏ ఏ
నిదుర లేదు కుదురు లేదు… నిమిషమైనా నాకే
కదలలేను, వదలలేను… మాయ నీదేనా
మాటలైనా రానే రావు… పెదవిదాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా… నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం… సరిపోయేనా దేహం
నీతో సావాసం… నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయె… కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయె… మనసు తనువును తాకితే