Interesting Facts about India in Telugu
మన దేశ జనాభా 140 కోట్లు, దేశ బడ్జెట్ 20లక్షల కోట్లు,
ఒకవేళ 140 కోట్ల రూపాయలు 140 కోట్ల మందికి పంచితే
ఏ ఒక్కరు కూడా పేదవారిగా వుండరు కదా..?
ఒక్కొక్కరికి ఒక కోటి వస్తుంది అనుకుంటున్నారా..?
140 కోట్ల రూపాయలు ఒక్కోరికి పంచితే,
140 కోట్ల జనాభాలో ఒక్కొక్కరికి వచ్చేది
ఒక్క రూపాయి మాత్రమే, కోటి కాదు.
ఒక్కోరికి కోటి పంచాలంటే,
140 కోట్ల కోట్లు రూపాయలు కావాలి.

ఒక వేళ, కోటి ప్రతి ఒక్కరికీ పంచినా,
సంపద పంపిణీ లో అసమానతలు అలాగే స్థిరంగా ఉంటాయి.
ఏ ఒక్క మనిషి యొక్క జీవన ప్రమాణం ఏమీ మారదు.
కానీ, ప్రజల కొనుగోలు శక్తి పెరగటం వలన
నిత్యావసర వస్తువులు ధర రాకెట్ అవుతాయి.
కిలో బియ్యం ఏ లక్ష రూపాయలో అవుతుంది.
తద్వారా, పేదలు స్థిరంగా ఏ చిన్న మార్పు లేకుండా
పేదలుగానే మిగిలి పోతారు.
అసలు ఎందుకు పంచాలి?
ఇప్పటికే ప్రభుత్వాలు సంక్షేమ పధకాల మాటున విరగబడి,
మతి భ్రమించి పంచి పెడ్తున్న ఉచితాలు చాలవా?
ప్రభుత్వాలు ఉచితంగా పంచి పెట్టేదానికి,
అది వారి సొంత డబ్బు కాదు, ప్రజలు బెగ్గర్స్ కారు.
ఉచితాల వలన పేదరికం పోదని కొన్ని దశాబ్దాల నుంచి తెలుస్తూనే ఉన్నది.
ఏమో మరి, ఎటు పోతున్నామో! ఇంకా ఉచితాలు ఆశిస్తూ!
పేదరికం పోవాలంటే ఏం చెయ్యాలి ?
మొదట దేశ వనరులకు అనుగుణంగా జనాభా, సాంద్రత, డిస్ట్రిబ్యూషన్ ను క్రమబధ్ధం చేయాలి.
తరువాత వారికి తగిన దీర్ఘకాల ప్రణాళిక తో తగిన విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలి.
మరి ప్రజలు కూడా తమ వంతు
ప్రభుత్వాలు ఉచితంగా పంచి పెట్టాలీ అనే భ్రమ నుంచి బయట పడి,
తాము ఏమి చేయాలి లేక ఏమి చెయ్యగలం అని ఆలోచించడం మొదలు పెట్టి ఆచరించాలి.
ప్రభుత్వాలు చేసేది ఉచితాల మాటున కాకులని కొట్టి గద్దలకు పెట్టడమే కాని,
వారి సొంత ఆస్తుల నుంచి లేక గాలిలో నుంచి ఇంద్రజాల విద్య తో
డబ్బులు తియాడం లేదని గ్రహించాలి.
ఈ రోజు మనకు ఒక ఉచితం వచ్చినది అంటే,
అది తిరిగి పెట్రోల్, నిత్యావసరాలు, లేక ఇంటి పన్ను పెంపుదల తదితర రూపాల్లొ,
పెను సర్పమై, తిరిగి ఉచితానికి పది రెట్ల రూపంలో కాటు వేస్తుందని గ్రహించాలి.
ఉచితాలు, విదిలింపులను ప్రోత్సహించరాదు, ఆశించరాదు.