Inspiring Telugu Stories
ఓ యువకుడు ఒక రైతు కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. రైతు ఒప్పుకొని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. “బాబూ, ఇదుగో ఈ పొలం చివర నిలబడు. నేను అటు నుండి వరసగా మూడు ఎద్దులను ఒకదాని తరవాత ఒకటి వదుల్తాను. ఏ ఒక్కదాని తోక పట్టుకొన్నా నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను.
“దానికి యువకుడు ఒప్పుకొన్నాడు. యువకుడు పొలంలో ఒక చివరన నిలబడ్డాడు, ఒడుపుగా ఎద్దు తోక పట్టుకుందామని. ఆ వైపు నుండి రైతు ఒక ఎద్దును ఒదిలి పెట్టాడు. బలిష్టంగా అంత ఎత్తున్న ఎద్దు రంకెలేస్తూ వచ్చింది. దాన్ని చూసి యువకుడు బెదిరి పోయి పక్కకు తప్పుకొని, తరవాత ఎద్దు కోసం ఎదురు చూసాడు.
అది మొదటి దానికన్నా భయంకరంగా ఉంది. బుసలు కొడుతూ, రంకెలేస్తూ ముందుకు దూసుకొచ్చింది. ప్రాణాలు అరచేత పట్టుకుని మూడో ఎద్దు కోసం ఎదురు చూసాడు. మూడోది బక్కపల్చగా గాలి వీస్తే చచ్చేట్లుగా ఉంది. ఆనందంగా అమాంతం ఆ ఎద్దు మీదికి ఎగిరి కూర్చుని తోక పట్టుకుందామని చూసాడు, ఆశ్చర్యంగా దానికి తోక లేదు.
జీవితంలో వచ్చే అవకాశాలలో కొన్ని సులువుగా, మరికొన్ని కఠినంగా ఉంటాయి. ఇంకో మంచి అవకాశం రాకపోతుందా అని, కనిపిస్తున్నదాన్ని ఒదిలేస్తే, మంచి అవకాశం మళ్ళీ రాదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైనవారి పని.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.