ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు. ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే. చీరకొంగు చీర అందానికే సొగసును పెంచే మకుట మాణిక్యం! అంతేకాకుండా.. పొయ్యి మీద వేడి గిన్నెలనుదింపడానికి పనికొచ్చే ముఖ్య సాధనం. పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం.
చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి చీరకొంగే! కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది అమ్మ కొంగు వెనకే. అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు అమ్మ కొంగే పెద్ద దిక్సూచి, మార్గదర్శి! అలాగే వాతావరణం:చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని వెచ్చగా చుట్టేది!
వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే! వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే! అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే. అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది! ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం! ఇంతటి అద్భుతమైన అమ్మకొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే!!
అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.