ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Importance of water in Telugu
అన్ని రోగాలకి చికిత్సకంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు. “భోజనాంతే విషం వారీ”, అంటే భోజనం చివర నీరు త్రాగటం విషంతో సమానం. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం.
నీరు త్రాగే విధానం – How to Drink Water
నీటిని గుటక గుటకగా త్రాగాలి. ఒక్కొక్క గుటక నోటిలో నింపుకంటూ చప్పరిస్తూ త్రాగాలి. వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి. నీరు ఎపుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి. ఇది నీరు త్రాగే సరైన విధానం. గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు.
ఫలితము:
నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది. పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది. అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి, లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి. అపుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును.
ఎప్పుడు త్రాగాలి – When to Drink Water
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి. బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంట న్నర తరువాత త్రాగాలి. ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది. అపుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది.
భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును. భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము, గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును.
ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తరువాత పండ్లరసాలు త్రాగవచ్ఛును.
మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగవచ్చును.
రాత్రి భోజనాంతరము పాలు త్రాగవచ్చు.
ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు. ఎందుకంటే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి.
నీరు ఎంత త్రాగాలి – How much Water Should we Drink Per Day
మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి. ఉదా: మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది. దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది. మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను.
ఎలా త్రాగాలి:
ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి .
నిలబడి నీళ్ళు త్రాగరాదు .
చల్లని నీళ్ళు ( Cool Water) త్రాగరాదు .
గోరు వెచ్చని నీళ్ళు త్రాగవలెను.
ఎండాకాలములో ( మార్చి నుండి జూన్) మట్టికుండలోని నీరు త్రాగవలెను.
మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయి.
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది.
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి .
ఎండ నుండి నీడకు వచ్చి వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి.
రిఫ్రిజిరేటర్ నీళ్ళు చాలా హానికరము.
మనకు ఆహారము ఎంత ప్రధానమో, తిన్న ఆహారము సక్రమంగా జీర్ణమటం అంతే ప్రధానము.
మనము తిన్న భోజనము జీర్ణము కాని యెడల అది కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన ఆహారము వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది. మొట్టమొదట గ్యాస్ ట్రబుల్, గొంతులో మంట, గుండెలో మంట, ఎసిడిటీ, హైపవర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి. చివరగా క్యాన్సర్.
మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగిన యెడల, మీరు జీవితంలో ఏ రోగాల బారిన బడరు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారు. ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది.
దయచేసి ఈ పోస్ట్ ని ప్రతి ఒక్కరికీ షేర్ చెయ్యండి, ఇది చాలా అవసరమైన, ఉపయోగకరమైన, ముఖ్యమైన విషియం.
మనం మంచి నీళ్ళు ఎప్పుడు, ఎంత, ఏ విధముగా త్రాగాలి – Importance of water in Telugu?