Menu Close

High BP People Should Avoid These Foods in Telugu – అదిక రక్తపోటు ఉన్నవారు వీటిని తినకూడదు.. చాలా ప్రమాదం.

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

High BP People Should Avoid These Foods in Telugu

మందులు, కొన్ని ఆహారాల ద్వారా నియంత్రణలో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. సాధారణ రక్తపోటు 120/80గా వుంటే సాధరణంగా వుందని పరిగణిస్తారు. అంతకు మించి ఎక్కువగా ఉంటే హై బీపీ (అదిక రక్తపోటు) కిందకి వస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే అది గుండెకు హాని కలిగిస్తుంది. అందువల్ల హై బీపీ రోగులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారలను తినకపోవడమే మంచిది. అలాంటి కొన్ని రకాల ఆహార పదార్దాల గురించి తెలుసుకుందాం.

High BP People Should Avoid These Foods bp

షుగర్ – చక్కెర

అధిక రక్తపోటు రోగులు షుగర్ లేదా తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ చక్కెర తినడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇది అధిక రక్తపోటుని మరింత పెంచుతుంది.

ఉప్పు

అధిక రక్తపోటు రోగులకు ఉప్పు విషం కంటే తక్కువేమి కాదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

కెఫీన్ – కాఫీ, సోడా

అధిక రక్తపోటు ఉన్న రోగులు కెఫిన్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. వారికి కాఫీ, సోడా వంటి పానీయాలు చాలా హానికరం. వీరు వీటికి దూరంగా ఉంటే మంచిది.

సుగంధ ద్రవ్యాలు – మసాలాలు

అధిక స్పైసి ఫుడ్ హై బీపీ రోగులకు చాలా హానికరం. ఇందులో ఉపయోగించే మసాలాలు రక్తపోటు సమస్యను మరింత పెంచుతాయి. తక్కువ మసాలాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి.

High BP People Should Avoid These Foods

ప్యాక్ చేసిన ఫుడ్

అధిక రక్తపోటు ఉన్న రోగులు ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. ప్యాక్ చేసిన ఆహారాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటుకు సోడియమే ప్రధాన కారణం.

High BP People Should Avoid These Foods in Telugu

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Health Tips in Telugu, Telugu Health Tips, ఆరోగ్య సూత్రాలు, Health Tips for High BP People, High Blood Pressure

Like and Share
+1
2
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading