Thalachinadhe Lyrics in Telugu - Manase Mandhiram - Telugu Bucket
Menu Close

Thalachinadhe Lyrics in Telugu – Manase Mandhiram

Thalachinadhe Lyrics in Telugu – Manase Mandhiram

తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ముగిసిన గాథ మొదలిడదు దేవుని రచనలలో
మొదలిడు గాథ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

మనసునకెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
మనసునకెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
ఎదలో ఒకరే కుదిరిననాడు మనసే ఒక స్వర్గం
ఒకరుండగా వేరొకరొచ్చారా లోకం ఒక నరకం
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం ఎది నిజమౌ బంధం
ఎది అనురాగం ఎది ఆనందం బ్రతుకునకేదీ గమ్యం
మంచి చెడు మారేదే మనదన్నది మాటేదే
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

Thalachinadhe Lyrics in Telugu – Manase Mandhiram

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading