Menu Close

కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? మీ కోసం అద్బుతమైన చిట్కా.. Health Tips in Telugu

కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? మీ కోసం అద్బుతమైన చిట్కా.. Health Tips in Telugu

కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? మీ కోసం అద్బుతమైన చిట్కా.. Health Tips in Telugu

ఎముకల బలహీనతత, ఎముకల నొప్పులతో, కీళ్లనొప్పులతో నడవలేని పరిస్థితిలో బాధపడుతున్నారో
అలాంటి వారిని సైతం పరిగెత్తేలా చేసే ఒక అద్భుతమైన ఆయుర్వేద రెమిడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలు కనుక మీ ఆహారంలో చేర్చుకుంటే కేవలం ఎముకల బలహీనతను తొలగించడమే కాకుండా
మీ నరాలు సిరలలో అడ్డంకులను తొలగించి మీ నరాల బలహీనతలను కూడా తొలగిస్తుంది.

ఎముకల మధ్య లో అరిగిపోయిన గుజ్జు ను గ్రీస్ ను కూడా తిరిగి ఏర్పడే లాగా చేస్తుంది.
ఎముకల మధ్యలో ఏర్పడే గ్యాప్ వల్ల కలిగే మోకాళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.
ఈ మోకాళ్ళ నొప్పులు మూలంగా చాలా మంది కనీసం మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితులలో కొద్ది దూరం కూడానడవలేక చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు.
ఇలాంటి సమస్యలు కూడా ఈ రెమిడీ కంట్రోల్లో ఉంచుతుంది. ఈ రఆయుర్వేద రెమిడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోని చూసి తెలుసుకోండి.

తయారీ విధానం: స్టవ్ వెలిగించి దానిమీద ఒక ఫ్యాన్ అని పెట్టి మూడు అక్రూట్ నట్స్ ,
రెండు స్పూన్ల అవిసె గింజలు, రెండు స్పూన్ల తెల్ల నువ్వులను విడివిడిగా కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోండి.
చల్లారిన తర్వాత మూడింటిని ఒక మిక్సీ జార్ లోకి వేసి మెత్తని పొడిలా తయారు చేసుకోండి.

ఎలా వాడాలి: ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కేవలం ఒక్క స్పూన్ కలిపి తీసుకుంటే చాలు.
అక్రూట్ ఇంగ్లీషులో దీనిని వాల్నట్ అని పిలుస్తారు ఇవి మీకు దగ్గరలోని సూపర్ మార్కెట్ లో చాలా సులభంగా దొరుకుతాయి.
వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఎముకలు దృఢంగా మార్చడానికి
మన జుట్టును ఆరోగ్యంగా నల్లగా మార్చడానికి మన ముఖం మీద వచ్చే ముడతలు నివారించి వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి.

Health Tips in Telugu

అక్రుట్: మీరు కనుక మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటే అలాంటి తలనొప్పిని సైతం ఈ అక్రుట్ చాలా సులభంగా కంట్రోల్లో ఉంచుతుంది.
ఇది మీతల నొప్పిని తగ్గించడమే కాకుండా మీ జ్ఞాపకశక్తిని కూడా రెట్టింపు చేస్తుంది.
ఎవరైతే కీళ్లు మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారో అలాగే ఎముకల మధ్య లో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారో దీన్ని మెడికల్ భాష లో synovial ఫ్లూయిడ్ అని పిలుస్తారు.
ఈ ఫ్లూయిడ్ అనేది ఎండిపోయిన లేదా అరిగిపోయిన అలాంటివారు ప్రతిరోజు ఈ అక్రూట్ తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోండి

అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్: ఇందులో ప్రోటీన్స్ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది అలాగే ఇందులో అక్రూట్ కన్నా ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా మన ఎముకలు ఉక్కులాగా మార్చడానికి హెల్ప్ చేస్తాయి.
అంతేకాకుండా ఇవి మన నరాల్లో బలహీనతలను అడ్డంకులను తొలగించడానికి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.
అలాగే ఇది మన గుండెకు సంబంధించిన వ్యాధులను ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వంటి సమస్యలను కూడా రాకుండా చేస్తుంది.

డయాబెటిస్తో బాధపడేవారు కూడా ఈ ఫ్లాక్ సీడ్స్ ను తీసుకుంటే మీ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
ఎవరైతే వయసు మీద పడుతున్నా యంగ్ లుక్ తో యూత్ ఫుల్ గా ఎక్కువ కాలం కనపడాలి అనుకుంటే
అలాంటి వారు తప్పకుండా ఈ అవిసె గింజలు తీసుకోండి. ఎందుకంటే ఇందులో ఆంటీ ఏజెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది మన ముఖం మీద ముడతలు కానీ గీతలు కానీ రానీయకుండా మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

తెల్ల నువ్వులు: వీటిని పవర్ హౌస్ అని పిలుస్తారు ఈ తెల్ల నువ్వుల లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది
వీటి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే క్యాల్షియం లోపం తో క్యాల్షియం టాబ్లెట్ వాడుతున్నారో అలాంటివారు
మందులకు బదులుగా ప్రతిరోజు ఆహారం తీసుకుంటే చాలు మీరు ఎటువంటి క్యాల్షియం టాబ్లెట్స్ వాడకుండానే
మీ శరీరానికి సరిపోయేంత క్యాల్షియం ఈ నువ్వుల ద్వారా పొందవచ్చు వీటిలో ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

ఇవి మన ఎముకలు దృఢంగా మార్చి మన దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
పంటికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను కూడా రాకుండా చేస్తుంది.
మన చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి.
అలాగే ఇవి మన శరీరం లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా నివారించి మన కండరాలు కూడా బలోపేతం చేస్తుంది.

Health Tips in Telugu

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker

Refresh Page
x

Subscribe for latest updates

Loading

Interesting Facts About Indian Flag in Telugu Rashmika Mandanna Images Sai Pallavi Photos Samantha Cute Photos Pooja Hegde Images