ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
బెండకాయ అందరికి ఇష్టమైన కూరే. సరిగ్గా వండుకోవడం చేత కావాలే గాని, బెండకాయ రుచి అదుర్స్. వేపుడు చేసినా, పోపు పెట్టి కూర చేసినా, డీప్ ఫ్రై తో పాటు అన్ని పల్లీలో..జీడిపప్పుతో కలిపినా.. ఇవన్నీ కాకుండా మసాలా కర్రీ చేసినా కూడా బెండకాయ టేస్ట్ అదిరిపోతుంది.
డయాబెటిస్ ఉన్న వారు కేవలం చేదు గా ఉండే కాకర మాత్రమే కాదు.. బెండకాయ కూడా హ్యాపీ గా తినేయచ్చు.
అయితే.. తినే విధానం లోనే కొన్ని మార్పులు చేసుకోవాలి.
షుగర్ స్థాయి ని కంట్రోల్ లో ఉంచడం లో బెండకాయ చాలా చక్కగా పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయ లో ఈజీ గా కరిగే మరియు కొంత కరగని ఫైబర్ ఉంటుంది. దీనిని ఆహరం గా తీసుకోవడం వలన.. ఇది శరీరం కార్బోహైడ్రేట్లను గ్రహించడాన్ని తగ్గిస్తుంది.
దీనివలన జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరిగి షుగర్ లెవెల్ పెరగ కుండా ఉంటుంది. డయాబెటిస్ బాధితులు వారానికి కనీసం మూడు సార్లు బెండకాయను తీసుకోవాలి. బెండకాయను ఎండబెట్టి తీసుకోవచ్చు, బెండకాయ నానబెట్టిన నీరు తాగడం కూడా మేలు చేస్తుంది.
పరగడుపున ఈ బెండకాయ నీటిని తాగితే ఉపయోగం ఉంటుంది. అయితే బెండకాయ పడనివారు, అలర్జీ ఉన్నవారు దూరం గా ఉండడం ఉత్తమం. పేగు సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయకు దూరం గా ఉండాలి.