Menu Close

Health benefits of Papaya in Telugu – బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Health benefits of Papaya in Telugu – బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బొప్పాయి పండు యొక్క శాస్త్రీయ నామం కారికా పపాయ (Carica papaya). ప్రపంచ వ్యాప్తంగా బొప్పాయి ని భారత దేశంలోనే ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ప్రపంచంలో మొత్తం 13 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే 6 మిలియన్ టన్నులు అంటే 45% ఉత్పత్తి జరుగుతుంది.

బొప్పాయి పండు లో ఉండే పోషక విలువలు మరియు ఔషధ గుణాల కారణంగా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి పండు లేదా కాయ ను ప్రెగ్నన్సీ తో ఉన్న వారు తినకుండా ఉంటె మంచిదని నిపుణులు భావిస్తారు.

Health benefits of Papaya in Telugu

ఒక 100 గ్రాముల బొప్పాయి పండు లో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి.

పేరుమొత్తం
శక్తి (Energy) 43kcal
Vitamin A, IU950IU
నీరు  (Water)88.1g
కార్బో హైడ్రేట్ (Carbohydrate)10.8g
షుగర్  (Sugars)7.82g
గ్లూకోజ్ (Glucose)4.09g
ఫ్రూక్టోజ్ (Fructose)3.73g
ఫైబర్  (Fiber)1.7g
ప్రోటీన్ (Protein)0.47g
కొవ్వు (fat)0.26g
పొటాషియం (Potassium)182mg
Vitamin C60.9mg
మెగ్నీషియం  (Magnesium)21mg
కాల్షియం (Calcium)20mg
ఫాస్ఫరస్ (Phosphorus)10mg
సోడియం (Sodium)8mg
కోలిన్ (Choline)6.1mg

బొప్పాయి పండు వల్ల కలిగే 10 ఉపయోగాలు

  1. బొప్పాయి పండు ఇన్ఫ్లమేషన్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది
  2. బొప్పాయి పండు అల్జిమర్స్ వ్యాధి నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
  3. బొప్పాయి పండు చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది
  4. బొప్పాయి పండు ఆకులు పంటి ఆరోగ్యానికి సహాయపడతాయి
  5. బొప్పాయి పండు డయాబెటిస్ ను తగ్గించటం లో సహాయపడుతుంది
  6. బొప్పాయి పండు గాయాలను నయం చేయటం లో సహాయపడుతుంది
  7. బొప్పాయి పండు కాన్సర్ వ్యాధిని తగ్గించటంలో సహాయపడుతుంది
  8. బొప్పాయి పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
  9. బొప్పాయి పండు జీర్ణ క్రియ లో సహాయపడుతుంది
  10. బొప్పాయి పండు వెంట్రుకల ఆరోగ్యానికి సహాయపడుతుంది

బొప్పాయి పండు ఇన్ఫ్లమేషన్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది: బొప్పాయి పండు మన శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటంలో మరియు ఇన్ఫ్లమేషన్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది. కొన్ని జంతు పరిశోధనల ప్రకారం బొప్పాయి పండు ఒబేసిటీ అంటే ఊబకాయం వచ్చే రిస్క్ ను కూడా తగ్గించటంలో దోహదపడుతుంది.

బొప్పాయి పండు అల్జిమర్స్ వ్యాధి నుంచి కాపాడటంలో సహాయపడుతుంది: ఆక్సిడేటివ్ స్ట్రెస్ అల్జిమర్స్ వ్యాధి పెరగటానికి దారి తీస్తుంది. ఆంటీ ఆక్సిడెంట్స్ తగినంత మోతాదులో లేకపోవటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి దారితీస్తుంది మరియు మెదడు లో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి జరుగుతుంది. ఫలితంగా కణాలను నష్టపరుస్తాయి.

40 మంది పై జరిగిన ఒక పరిశోధనలో ఫెర్మెంటెడ్ పాపయ పౌడర్(fermented papaya powder) అంటే పులియ పెట్టిన పౌడర్ ను 6 నెలల వరకు ఇవ్వటం జరిగింది. ఫలితంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించటంలో సహాయపడుతుంది.

Health benefits of Papaya in Telugu

బొప్పాయి పండు చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది: మన శరీర చర్మం సహజంగానే వయసుతో పాటు మందం గా అవ్వటం మరియు ముడతలు పడటం లక్షణాలు చూస్తాము కాని కొన్ని సార్లు వయసుతో సంభందం లేకుండానే చర్మం యొక్క ఆరోగ్యం క్షీణించటం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం UV కిరణాల వల్ల మన చర్మం కఠినంగా మారటం లాంటి మార్పులు రావటం జరుగుతుంది. బొప్పాయి పండులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేషన్ మరియు ఆంటీ యాక్సిడెంట్ గుణాలు ఆంటీ స్కిన్ ఏజింగ్ గా దోహదపడుతుంది. బొప్పాయి పండులో ఉండే పోషక విలువలు చర్మం యొక్క ఎలాస్టిసిటీ ను పెంచటంలో మరియు చర్మం యొక్క ముడతలను తగ్గించటంలో సహాయపడుతుంది.

బొప్పాయి పండు ఆకులు పంటి ఆరోగ్యానికి సహాయపడతాయి: కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల మన దంత చిగుళ్లలో నుంచి రక్తం రావటం మరియు దంతాలు వాపు కు గురి అవ్వటం లాంటి సమస్యలను చూస్తూ ఉంటాము. మనుషుల జరిపిన ఒక పరిశోధన ప్రకారం బొప్పాయి పండు ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ ఉన్న టూత్ పేస్ట్ ను ఉపయోగించిన తరవాత చిగుళ్ల నుంచి రక్తం రావటం మరియు పంటి లో వచ్చే వాపు ఘననీయంగా తగ్గటం గమనించడం జరిగింది.

బొప్పాయి పండు డయాబెటిస్ ను తగ్గించటం లో సహాయపడుతుంది: బొప్పాయి పండు లో ఉండే ఆంటీ యాక్సిడెంట్ గుణాలు డయాబెటిస్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది.

ఫెర్మెంటెడ్ పపాయ ప్రేపరేషన్ (fermented papaya preparation) డయాబెటిస్ కు వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది. మనుషుల పై జరిపిన పరిశోధనలో 14 వారాల వరకు ఆరు గ్రాముల ఫెర్మెంటెడ్ పపాయ ప్రేపరేషన్ ను తీసుకున్నారు. ఫలితంగా శరీరంలో ఆంటియాక్సిడెంట్ గుణాలను పెంచటంలో దోహదపడింది.

ఇంతేకాకుండా డయాబెటిస్ వల్ల రిస్క్ లో ఉన్న ఇతర శరీర అవయవాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచిందని కూడా గమనించటం జరిగింది. ఎలుకల పై జరిపిన పరిశోధనలో కూడా బొప్పాయి పండు ఎక్స్ట్రాక్ట్ డయాబెటిస్ ను తగ్గించటంలో సహాయపడుతుందని తేలింది.

బొప్పాయి పండు గాయాలను నయం చేయటం లో సహాయపడుతుంది: వయసు పెరిగే కొద్దీ గాయాలు మానటానికి పట్టే సమయం కూడా పెరుగుతుంది. బొప్పాయి కాయ యొక్క ఎక్స్ట్రాక్ట్ లో ఉండే యాంటీఆక్సిడాంట్ మరియు ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గాయాలు త్వరగా మానటంలో సహాయపడుతాయి.

డయాబెటిస్ వ్యాధి తో బాధపడుతున్న వారిలో గాయాలు త్వరగా మానవు కానీ ఒక పరిశోధన ప్రకారం ఫెర్మెంటెడ్ పపాయ ప్రేపరేషన్ ను శరీర బరువు యొక్క ఒక్క కేజీ కు 0.2 గ్రాముల చొప్పున 8 వారాల వార కు తీసుకోవటం జరిగింది. ఫలితంగా డయాబెటిస్ లో కలిగిన గాయాలు త్వరగా మనటానికి దోహదపడింది అని తెలిసింది.

బొప్పాయి పండు కాన్సర్ వ్యాధిని తగ్గించటంలో సహాయపడుతుంది: ఒక పరిశోధన ప్రకారం ఫెర్మెంటెడ్ పపాయ ప్రేపరేషన్ తీసుకోవటం వల్ల శరీరంలో ఆంటియాక్సిడెంట్ స్థాయిలను పెంచటంలో మరియు DNA కు జరిగే డ్యామేజ్ నుంచి కాపాడటంలో కూడా సహాయపడుతుంది అని తేలింది.

కొన్ని ఎలుకల పై జరిపిన పరిశోధనలో కూడా ఫెర్మెంటెడ్ పపాయ ప్రేపరేషన్ క్యాన్సర్ వల్ల కలిగే ట్యూమర్లను నయం చేసింది అని తేలింది. కానీ ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే పరిశోధనలు జరిగాయి. ఇంకా ఎక్కువ మోతాదులో పరిశోధనలు జరగాల్సి ఉంది.

బొప్పాయి పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది: బొప్పాయి పండులో విటమిన్ లు గుండె కు సంబంధించిన సమస్యలను తగ్గించటంలో దోహదపడతాయి.ఈ పండులో ఉండే పొటాషియం కూడా బ్లడ్ ప్రెషర్ కు సంబంచిన సమస్యలలో సహాయపడుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఎక్కువ పొటాషియం తీసుకోవటం హాని చేస్తుంది అని నిపుణుల అంచనా. ఈ పండు లో ఉండే ఫైబర్ కూడా గుండెకు సంబంచిన సమస్యలైనా బ్లడ్ ప్రెషర్ ను మరియు కొవ్వు ను తగ్గించటంలో సహాయపడుతుంది.

బొప్పాయి పండు జీర్ణ క్రియ లో సహాయపడుతుంది: పండుగా మారని బొప్పాయి కాయలో మంచి మోతాదులో పపైన్ (Papain) అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ జీర్ణ క్రియ కు దోహదపడుతుంది. మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీనులను జీర్ణం చేయటానికి సహాయపడుతుంది.

ఇదే కాకుండా సిలియాక్ (Celiac) అనే జీర్ణ క్రియ కు సంబంధించిన వ్యాధి తో భాదపడుతున్న వారికి కూడా సహాయపడుతుంది. బొప్పాయి కాయ ను మాంసం టెండరైజర్ గా కూడా ఉపయోగిస్తారు.

బొప్పాయి పండు వెంట్రుకల ఆరోగ్యానికి సహాయపడుతుంది: బొప్పాయి పండులో ఉండే విటమిన్ A మరియు విటమిన్ C లు వెంట్రుకల ఆరోగ్యానికి మరియు దృఢత్వానికి సహాయపడుతుంది. చాలా మంది పపాయ ను హెయిర్ మాస్క్ మరియు స్కిన్ మాస్క్ గా కూడా ఉపయోగిస్తారు.

Health benefits of Papaya in Telugu – బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading