Menu Close

Health Benefits of Figs in Telugu – అంజీర్ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of Figs in Telugu – అంజీర్ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అంజీర్ పండు లేదా అత్తి పండును ఇంగ్లీష్ లో ఫిగ్స్(Figs) అని అంటాము. ఈ పండు యొక్క శాస్త్రీయ నామం ఫికస్ కారికా (Ficus carica) అని అంటారు. అంజీర్ ను ఒక పండు లాగా మరియు ఎండిన తరవాత డ్రై ఫ్రూట్ లాగా తింటారు. అంజీర్ పండు గా ఉన్నప్పటి కంటే ఎండిన తరవాత పోషక విలువలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి.

Health Benefits of Figs in Telugu

అంజీర్ పండు పోషక విలువలు

పేరు మొత్తం 
శక్తి (Energy) 74kcal
నీరు (Water)79.1g
పొటాషియం (Potassium)232mg
కాల్షియం (Calcium)35mg
కార్బో హైడ్రేట్ (Carbohydrate)19.2g
మెగ్నీషియం (Magnesium)17mg
షుగర్ (Sugars)16.3g
ఫాస్ఫరస్ (Phosphorus)14mg
ఫైబర్ (Fiber)2.9g
సోడియం (Sodium)1mg
ప్రోటీన్ (Protein)0.75g
ఐరన్ (Iron)0.37mg
కొవ్వు (fat)0.3g

అంజీర్ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • విటమిన్లు మరియు పోషకాలు (Nutrients) :
  • అంజీర్ పండు జీర్ణ వ్యవస్థ ను మెరుగు పరచడానికి సహాయపడుతుంది
  • అంజీర పండు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది
  • అంజీర పండు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • అంజీర పండు ఒక మంచి ఆంటియాక్సిడెంట్
  • అంజీర పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • అంజీర పండు షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది

అంజీర్ పండు జీర్ణ వ్యవస్థ ను మెరుగు పరచడానికి సహాయపడుతుంది: అంజీర పండు లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ లో తరచుగా వచ్చే డైజెస్టివ్ డిసార్డర్ (జీర్ణ రుగ్మతలు), ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ ను నయం చేయటం లో సహాయ పడుతుంది. 150 మంది పై జరిగిన ఒక పరిశోధనలో 4 నెలల వరకు అంజీర పండును తీసుకోవటం జరిగింది. అయితే వీరిలో నొప్పి, ఎక్కువ సార్లు మలవిసర్జనకు వెళ్లటాన్ని మరియు హార్డ్ స్టూల్ (గట్టి మలం) లాంటి సమస్యలను నయం చేయటం లో సహాయ పడింది. కొన్ని జంతువుల మీద చేసిన పరిశోధనల ప్రకారం అంజీర పండు పేస్ట్ కాన్స్టిపేషన్ (మలబద్దకం) చికిత్స లో మంచి ఫలితాలను చూపించింది.

అంజీర పండు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది: ఒక ల్యాబ్ లో జరిగిన అధ్యయనం ప్రకారం అంజీర పండు చెట్టు యొక్క ఆకులు మరియు చెట్టు నుంచి వచ్చే లేటెక్స్ క్యాన్సర్ సెల్స్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుందని తేలింది.

Winter Needs - Hoodies - Buy Now

ఒక పరిశోధన ప్రకారం అంజీర పండు చెట్టు ఆకులు బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమయ్యే కణాలకు వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది. అయితే ఈ పరిశోధనలు ల్యాబ్ కే పరిమితంగా ఉన్నాయి, దీనిపై ఇంకా ఎక్కువ మోతాదులో పరిశోధనలు జరగాల్సి ఉంది.

Health Benefits of Figs in Telugu

అంజీర పండు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది: అంజీర పండు హై బ్లడ్ ప్రెషర్ కు వ్యతిరేకంగా పంచేయటంలో మరియు నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలుకల పై చేసిన ఒక పరిశోధనలో అంజీర పండు ఎక్స్ట్రాక్ట్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో మరియు వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడింది.

అంజీర పండు ఒక మంచి ఆంటియాక్సిడెంట్: అంజీర పండులో పోషక విలువలు ఒక మంచి ఆంటియాక్సిడెంట్ గా సహాయపడుతుంది. అంజీర పండు లో ఉండే లేటెక్స్ సహజ ఆంటియాక్సిడెంట్ గా పనిచేయటంలో సహాయపడుతుంది. అంజీర పండులో ఉండే గుజ్జు కన్నా తొక్క లో ఎక్కువగా ఫెనోలిక్ కాంపౌండ్ లు ఉంటాయి. అంజీర పండు ఎంత ఎక్కువగా పండితే అంత ఎక్కువగా ఫెనోలిక్ కాంపౌండ్ లు ఉంటాయి. ఎంత ఎక్కువగా ఫెనోలిక్ కాంపౌండ్ లు ఉంటే అంత ఎక్కువ మోతాదులో ఆంటియాక్సిడెంట్ లు ఉంటాయి.

అంజీర పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది: మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత కాల్షియం కావాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్ అంజీర్ లో ఉండే కాల్షియం ఎముకల సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు ఎముకలకు సంభందించిన రోగాల నుంచి దూరం ఉంచుతుంది (12).

అంజీర పండు షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది: అంజీర పండు తో ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ ఈ చెట్టు యొక్క ఆకుల తో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులు బ్లడ్ షుగర్ లెవల్స్ ను మరియు చెడ్డ ఫ్యాట్ ను నియత్రించటంలో సహాయపడుతుంది.

28 రోజుల వరకు టైపు 2 డయాబెటిస్ ఎలుకలపై జరిగిన పరిశోధనలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి ఈ ఆకులు సహాయ పడ్డాయి. అంజీర పండు కాకుండా వీటి ఆకులు మరియు లేటెక్స్ వల్ల కూడా మంచి ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పరిశోధనలు ల్యాబ్ కె పరిమితంగా ఉన్నాయి. ఇంకా ఎక్కువగా పరిశోధనలు జరగాల్సి ఉంది.

Health Benefits of Figs in Telugu – అంజీర్ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading