Menu Close

Custard Apple Health Benefits in Telugu – సీతాఫలం పండు ఆరోగ్య ప్రయోజనాలు

Custard Apple Health Benefits in Telugu – సీతాఫలం పండు ఆరోగ్య ప్రయోజనాలు

సీతాఫల పండును ఇంగ్లీష్ లో కస్టర్డ్ ఆపిల్ (Custard Apple) లేదా చెరిమేయ (Cherimoya) అని అంటారు. సీతాఫల పండు యొక్క శాస్త్రీయ నామం అన్నోనా చేరిమొల (Annona cherimola). ఈ రోజుల్లో పట్టణాలలో సీతాఫలం పండ్లు చాలా అరుదుగా కనిపిస్తాయి కానీ గ్రామాలలో మాత్రం సీతాఫల చెట్లు చెప్పలేనంత గా ఉంటాయి. దాదాపు చాలా మంది పచ్చి సీతాఫలాలలను ఇంటికి తీసుకువెళ్లి గోనెసంచిలో పెట్టి మాగటానికి పెడతారు. సీతాఫల పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ పండ్లని ఇష్టపడని వారు ఉండరు అనుకుంటాను.

Custard Apple Health Benefits in Telugu

ఒక 100 గ్రాముల సీతాఫల పండులో కింద చూపిన విధంగా పోషక విలువలు

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

పేరు మొత్తం 
పొటాషియం (Potassium)287mg
నీరు (Water)79.4g
శక్తి (Energy) 75kcal
ఫాస్ఫరస్ (Phosphorus)26mg
కార్బోహైడ్రేట్  (Carbohydrate)17.7g
మెగ్నీషియం (Magnesium)17mg
షుగర్ (Sugars)12.9g
Vitamin C12.6mg
కాల్షియం (Calcium)10mg
సోడియం (Sodium)7mg
ఫ్రూక్టోజ్ (Fructose)6.28g
గ్లూకోజ్ (Glucose)5.93g
ఫైబర్  (Fiber)3g
ప్రోటీన్ (Protein)1.57g
కొవ్వు (fat)0.68g
సుక్రోస్  (Sucrose)0.66g
నియాసిన్ (Niacin)0.644mg
Pantothenic acid (vitamin B5)0.345mg
ఐరన్ (Iron)0.27mg
Vitamin B-60.257mg
జింక్ (Zinc)0.16mg
Riboflavin (Vitamin B2)0.131mg
Lutein + zeaxanthin6 µg

సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు

  • సీతాఫల పండులో మంచి పోషక గుణాలు మరియు న్యూట్రియంట్లు ఉంటాయి.
  • సీతాఫల పండు కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • సీతాఫల పండు జీర్ణ వ్యవస్థలో సహాయపడుతుంది
  • సీతాఫలం క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయ పడుతుంది
  • సీతాఫల పండు ఒక మంచి ఆంటియాక్సిడెంట్
  • సీతాఫల పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • సీతాఫల పండు మన మెదడు యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • సీతాఫల పండు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచడంలో సహాయపడుతుంది.
  • సీతాఫల పండు ఇమ్మ్యూనిటి ని కూడా పెంచటంలో సహాయపడుతుంది
  • సీతాఫల పండు ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది.
  • సీతాఫల పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది

సీతాఫల పండు కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది: మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కళ్ళు లేకుండా మనం మన జీవితాన్ని ఉహించుకోలేము. కానీ ఒక వయసు తర్వాత కంటి చూపు పోవటం లేదా మసక బారటం లాంటి సమస్యలను మనం చూస్తూ ఉంటాము. దీనినే మనం age-related macular degeneration (AMD) అని అంటాము.

ఈ సమస్యను అధిగమించటానికి శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్ ప్రకారం కెరోటినాయిడ్ ఎక్కువగా ఉండే ఆహారం ఈ సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. సీతాఫలం లో ఉండే లుటీన్ (lutein) మరియు జియాజాన్థిన్ (zexanthin) వయసు తో పాటు వచ్చే కళ్ళకు సంబంధించిన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. లుటీన్ (lutein) లో మంచి ఆంటియాక్సిడెంట్ గుణాలు ఉంటాయి ఫలితంగా హానికారకమైన రియాక్టీవ్ ఆక్సిజన్ స్పీసీస్ (ROS) ను కూడా తొలగించటంలో సహాయపడుతుంది.

సీతాఫల పండు జీర్ణ వ్యవస్థలో సహాయపడుతుంది: ఈ రోజుల్లో పండ్లను మనము తగినంత మోతాదులో తీసుకోవటం లేదు. పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సంభందించిన ఆరోగ్య సమస్యలైన కాన్స్టిపేషన్ (మలబద్దకం), ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ (కడుపులో నొప్పి ) మరియు ఇంఫ్లమేటరీ బౌల్ డిసీస్ (పేగు వాపు) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. సీతాఫల పండు మన శరీరం లోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది.

సీతాఫలం క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయ పడుతుంది: సీతాఫలంలో ఉండే ఫ్లేవనాయిడ్స్ (Flavonoids) వివిధ రకాల క్యాన్సర్ ల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. సీతాఫలంలో ఉండే కాటెచిన్ (catechin) ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్), లంగ్ క్యాన్సర్ (ఊపిరితిత్తుల క్యాన్సర్), కాలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దప్రేగు క్యాన్సర్) క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది.

Custard Apple Health Benefits in Telugu

సీతాఫల పండు ఒక మంచి ఆంటియాక్సిడెంట్: సీతాఫలం పండులో మంచి ఆంటియాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ ఆంటియాక్సిడెంట్ గుణాలు మన శరీరాన్ని నష్టపరిచే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్లనే మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి అయ్యి దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతుంది.

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

సీతాఫల పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది: ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ వల్లనే గుండెకు సంబంధించిన అనారోగ్యాలు వస్తున్నాయి. అయితే దాదాపు అన్ని పండ్లు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ వల్లనే గుండెకు సంబంధించిన అనారోగ్యాలు వస్తున్నాయి. అయితే దాదాపు అన్ని పండ్లు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతాయి. సీతాఫలం లో ఉండే మంచి పోషక విలువలు గుండె ఆరోగ్యానికి సహాయపడుతాయి. సీతాఫలం లో ఉండే పొటాషియం మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం కిడ్నీ సమస్యలు లేని వారు మంచి మోతాదులో పొటాషియం తీసుకున్నట్లైతే వారిలో గుండె పోటు వచ్చే అవకాశాలని 24% తగ్గిస్తుంది.

సీతాఫల పండు మన మెదడు యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది: ఒక 100 గ్రాముల సీతాఫల పండు లో 0.25 గ్రాముల విటమిన్ B6 ఉంటుంది. మన శరీరానికి ఒక రోజు కి కావాల్సిన విటమిన్ B6 పోషక విలువలలో 20% సీతాఫలం పండులో ఉంటుంది. ఒక రీసెర్చ్ ప్రకారం వయసు పై బడిన వారిలో జ్ఞాపక శక్తిని పెంచటానికి మరియు అల్జీమర్స్ వ్యాధి వలన భాదపడుతున్న వారికి విటమిన్ B6 సహాయపడుతుంది.

మన శరీరంలో విటమిన్ B6 సరైన మోతాదులో లేకపోవటం వల్ల మనం డిప్రెషన్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. విటమిన్ B6 న్యూరో ట్రాన్స్ మిట్టర్ తయారీ లో కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుంది, మన మూడ్ ను మంచిగా మార్చే సెరోటోనిన్ మరియు డోపమీన్ ల కోసం సహాయపడుతుంది.

సీతాఫల పండు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచడంలో సహాయపడుతుంది: సీతాఫలంలో ఉండే విటమిన్ C మన చర్మ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. విటమిన్ C కొల్లాజిన్ అనే ప్రోటీన్ నిర్మాణం లో సహాయపడుతుంది. ఈ కొల్లాజిన్ అనే ప్రోటీన్ మన చర్మానికి ఎలాస్టిసిటీ అంటే సాగే గుణాన్ని ఇస్తుంది. విటమిన్ C UV రేడియేషన్ నుంచి కాపాడటంలో కూడా సహాయపడుతుంది.

సీతాఫల పండు ఇమ్మ్యూనిటి ని కూడా పెంచటంలో సహాయపడుతుంది: విటమిన్ C మన ఇమ్యూన్ సిస్టం అంటే రోగనిరోధక వ్యవస్థ ను వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. విటమిన్ C తగిన మోతాదులో తీసుకోక పోవటం వలన రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.

సీతాఫల పండు ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది: సీతాఫల పండు లో కేరోనోయి (kaurenoic) ఆసిడ్ లాంటి మంచి ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కొన్ని జంతువుల మీద జరిపిన పరిశోధనల ప్రకారం ఈ ఆసిడ్ ఇన్ఫ్లమేషన్ లేదా వాపు కు గురి చేసే ప్రోటీనులను తగ్గించటంలో సహాయపడుతుంది.

సీతాఫల పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది: మన శరీరంలోని 99% కాల్షియం ఎముకలతో ఉంటుంది, అయితే కాల్షియం మన శరీరానికి ఎంత అవసరమో చెప్పనక్కర్లేదు. 100 గ్రాముల సీతాఫల పండులో 10 గ్రాముల కాల్షియం ఉంటుంది. ఈ పండు తినటం వల్ల ఎముకలు గట్టిగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

Custard Apple Health Benefits in Telugu – సీతాఫలం పండు ఆరోగ్య ప్రయోజనాలు

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading